తాండూర్ నియోజకవర్గానికి మహార్దశ
- ఎన్ హెచ్ (167)ఎన్ కు అనుమతులు జారీ
తాండూర్ : తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారి కృషి ఫలించిన వేళ రూ.487.12 కోట్ల రూపాయలు రహదారి పనులకు నిధులు మంజూరు,టెండర్ల ప్రక్రియ ప్రారంభం చేయడం జరిగింది.42 కిలోమీటర్ల వరకు రోడ్డుపనుల విస్తరణ మరియు తాండూరు కొడంగల్ నియోజకవర్గాలకు బైపాస్ రోడ్డు,తాండూర్ నుండి సరిహద్దు వరకు ఫోర్ లైన్ రోడ్డు గౌరవ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారి చెరువుతో మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి పట్టుదలతో ఇట్టి బైపాస్ రోడ్డు మంజూరు కావడం జరిగింది.తాండూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగిస్తు తను ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్న నాయకుడు మన ఎమ్మెల్యే .రాబోయే రోజుల్లో తాండూరు దిషా దశ మార్చే పనుల్లో మన గౌరవ ఎమ్మెల్యే ఇచ్చిన మాట విడిచిన బాణం తిరిగి తీసుకొని నాయకుడు మన గౌరవ ఎమ్మెల్యే.అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్న తాండూర్ నియోజకవర్గ ప్రజానీకం మరియు రాజకీయ ప్రజాప్రతినిధులు రైతులు.
ఎమ్మెల్యేను కలసిన మైనారిటీ ప్రజలు
తాండూరు శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారికి కోట్ పల్లి ముస్లిం మైనారిటీ పెద్దలు కలవడం జరిగింది.అభివృద్ధి పనుల గురించి నిధులు ఇవ్వాలని మైనారిటీల సమస్యల పరిష్కారం గురించి సాయం చేయాలని కోరగా అభివృద్ధి పనులకు తొందరలోనే ప్రొసీడింగ్స్ ఇస్తామని సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడడం జరిగింది.శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారు చూపిన స్పందన ఆప్యాయత ను మైనారిటీ పెద్దలు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.