Type Here to Get Search Results !

Sports Ad

అధికారులతో రోడ్డు భద్రత మీటింగ్ ఎస్‌పి శ్రీ. ఎన్. కోటిరెడ్డి Vikarabad

 

అధికారులతో రోడ్డు భద్రత మీటింగ్ ఎస్‌పి శ్రీ. ఎన్. కోటిరెడ్డి

వికారాబాద్ : RTC/RTO శాఖ అధికారులతో రోడ్డు భద్రత మీటింగ్ నిర్వహించిన జిల్లా ఎస్‌పి శ్రీ. ఎన్. కోటిరెడ్డి.ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా,రోడ్డు భద్రతలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా  పోలీస్ వారికి సహకరిస్తూ ప్రతి ఒక్క ప్రయాణం సాఫీగా సాగే విదంగా అన్నీ శాఖ అధికారులు కలిసికట్టుగా పనిచేద్దాం.ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి గారు RTC / RTO అధికారులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను ఏ విధంగా నివారించాలో తెలియజేయడం జరిగింది.ఆర్టిసి అధికారులు ప్రతి ఒక్క బస్ డ్రైవరుతో రోడ్డు భద్రత గురించి మాట్లాడి వారు ఎటువంటి జాగ్రతలు తీసుకోవాలి అనే విషయాన్ని స్పష్ఠంగా తెలియజేయాలి బస్ ప్రయాణించే ముందు ప్రతి ఒక్క బస్ డ్రైవరు ను డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయాలి.మరియు ఆక్సిడెంట్ జరగకుండా జ్రాగ్రతగా డ్రైవ్ చేసివిధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. మరియు ప్రతిఓ ఒక్క బస్ యొక్క కండిషన్ చెక్ చేసుకోవాలి.

ఈ మధ్య కాలంలో ఎక్కువ బస్ రోడ్డు ప్రమాదాలు కేవలం బస్ బ్రేక్ డౌన్ అవ్వడం వలన అని తెలిసింది కావున ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి.అనంతగిరి లాంటి ఎత్తైన ప్రదేశాలలో తిరిగే బస్ యొక్క స్థితి గతుల్ని ప్రతిసారి పరిశీలించాలి.ప్రమాదాలు జరిగిన వెంటనే ఘటన స్థలనికి డిపో మ్యానేజర్,సంబందిత అధికారులు ఘటన ప్రదేశానికి చేరుకొని ప్రజలు చేస్తున్న ఆందోళనను కొంత వరకు తగ్గించాలి.ఘటన స్థలనికి పోలీస్ వారితోపాటు ఆర్టిసి డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఉంటే సమస్యను సులయాసంగా నివారించవచ్చని కావున పోలీస్ వారికి సహకరించాలని తెలియజేయడం జరిగింది.

మరియు ఆర్టిఓ అధికారులు బస్ ప్రమాదానికి ఎందుకు గురి అయ్యిందనే విషయాన్ని తెలుసుకొని తర్వాత టువంటివి జరగకుండా చూసుకోవాలని తెలియజేయడం జరిగింది.మరియు వర్షా కాలంలో,మంచు కురుస్తున్న సమయంలో జాగ్రతగా బుస్సులు నడపలని తెలియజేయడం జరిగింది.ఆర్టీసీ డ్రైవరు అన్నీ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపలని తెలియజేయడం జరిగింది.మరియు బస్ టాప్ పైకి ఎవ్వరిని కూడా ఎక్కించరాదని జిల్లా ఎస్‌పి తెలియజేయడం జరిగింది.ఎంవిఎ మేఘన గారితో మాట్లాడుతో ట్రాఫిక్ నిభందానాలు పాటించని వాహనాలపై చర్యలు తీసుకోవాలని మరియు జిల్లాలో అధిక బరువు కలిగిన వాహనాలపై చర్యలు తీసుకోవాలని లారీలు అధిక బరువులతో ఇబ్బందులు కల్గిస్తున్నాయి.కావున లోకల్ పోలీస్ వారు నిర్వహించే నకబంది,వాహన చెకింగ్ లో పాల్గొనలని తెలియజేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్‌పి శ్రీ.ఎం‌ఏ.రషీద్, డిప్యూటీ ఆర్ఓ జ్యోతి,తాండూర్ డి‌ఎస్‌పి శేకర్ గౌడ్, పరిగి  డి‌ఎస్‌పి కరుణాసాగర్,వికారాబాద్ డి‌ఎస్‌పి సత్యనారాయణ మరియు తాండూర్,పరిగి,వికారాబాద్ డిఎం,వికారాబాద్ ఎంవిఎ మేఘనమరియు పోలీస్ అధికారులు పాల్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies