పేదల పొట్ట కొట్టే బ్రతికేవారికి తగిన బుద్ధి చెప్తం
సుజాతనగర్: గరీబుపేట గ్రామపంచాయితీలో పోడు భూమికి సంబందించిన గ్రామసభ ఈ నెల 25న నిర్వహించారు. ఈ గ్రామసభ సజావుగా సాగలేదని కొంత మంది రాజకీయ నాయకులు వార్తలు సృష్టించారని బుధవారం స్థానిక పోడు రైతులు అన్నారు.ఈ విషయంపై చిట్టిరామవరం తండా పోడు రైతులు సుజాతనగర్ మండల తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు.చిట్టి రామవరం తండాకు సంబందించిన పోడు భూమి సర్వే నవంబర్ 16న మండల స్థాయి అధికారులు,పోలీసుల అధ్వర్యంలో జరిగిందని గుర్తు చేశారు.అలాగే ఈ నెల 25న అంబేద్కర్ కాలనీలో గ్రామసభ సజావుగానే సాగిందని,ఇందులో ఎలాంటి తప్పిదాలు జరగలేదన్నారు.కానీ ఇటీవల కొంత మంది నాయకులు కావాలని తప్పుడు వార్తలు సృష్టించారని అన్నారు.
40 ఏళ్ల నాటి పోడు భూమికి మోక్షం లభిస్తున్న వేళ ఇబ్బందులు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. గ్రామసభ సరిగ్గా జరగలేదని తెరచాటుగా ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేయడం సబబు కాదన్నారు.ఎన్ని రాళ్ళు వేసినా మా పోడు ఉద్యమంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెలిపారు.పేదల పొట్ట కొట్టే దుశ్చర్యకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ భూక్యా శ్రీనివాస్,2వ ఇంక్లైన్ సర్పంచ్ గుగులోతు నగేష్,జేఏసీ నాయకులు పూర్ణచందర్,పోడు రైతులు పాల్గొన్నారు.
అనిల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ను ప్రారంభం
-ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు
కొత్తగూడెం : బుధవారం రోజున ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం పట్టణంలోని ఎంజీ రోడ్ ఐసిఐసిఐ బ్యాంక్ పైన అనిల్ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ను ప్రారంభించారు.నిర్వాహకులకు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని కోరారు.నిర్వాహకులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి,సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీ కాసాని ఐలయ్య,మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య,ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా,కౌన్సిలర్లు కోలాపూరి ధర్మరాజు,బండి నరసింహా, రుక్మిధర్ బండారి,టిఆర్ఎస్ నాయకులు ఎంఏ.రజాక్, టీబీజీకేస్ నాయకులు కాపుకృష్ణ,మసూద్,22వ వార్డ్ యాకూబ్,జాని,నాగరాజు, నరేందర్,హమీద్,కర్రీ స్వప్న,కర్రీ శేఖర్ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,షాప్ యజమాని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.