రాష్ట్ర ప్రథమ మహాసభ ఈనెల 11న విజయవంతం చేయాలి
- కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్
- కేజీబీవీ హాస్టల్లో ఏడు వేల పైచిలుకు కార్మికులు
- IFTU వికారాబాద్ జిల్లా కమిటీ
తాండూర్ : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రథమ మహాసభ ఈనెల 11వ తారీకు హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో జరగబోయే రాష్ట్ర మహాసభల విజయవంతం కై రాష్ట్ర మహాసభల పోస్టర్ను కేజీబీవీ తాండూర్ నియోజకవర్గంలోని జినుగుర్తి,బషీరాబాద్ మండలం,యాలాల మండలం లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై గీత ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వై గీత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 475 కేజీబీవీ హాస్టల్లో ఏడు వేల పైచిలుకు కార్మికులు కుకింగ్ హెల్పింగ్ స్లీపర్ స్కావెంజర్ డే అండ్ నైట్ వాచ్మెన్ అటెండర్లు అతి తక్కువ వేతనాలతో మహిళ కార్మికులు పనిచేస్తున్నారు.ఎలాంటి భద్రత లేకుండా పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు అనేకంగా ఉన్నాయి వెట్టిచాకిరి మహిళలతో చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.