జనవరి 11న ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభ
- బీజేపీ పాలనలో మాదిగలకు మిగిలింది మోసమే
- మాదిగలు ఎస్సీ వర్గీకరణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి
- ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభను విజయవంతం చెద్దం
- ఎమ్మార్పిఎస్ పెద్దేముల్ మండల అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ మాదిగ
- ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ
పెద్దేముల్ : పెద్దేముల్ ఎమ్మార్పిఎస్ సభను నిర్వహించారు.మండలంలో గత ఎనిమిది సంవత్సరాలుగా దేశాన్ని పరపాలించిన బీజేపీ ప్రభుత్వం వల్ల మాదిగలకు మోసమే మిగిలిందని ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మల్లికార్జున్ మాదిగ అన్నారు.పెద్దేముల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో నాయకులు మల్లికార్జున్ మాదిగ శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ ప్రస్తుతం భారత దేశంలో హక్కుల కోసం సుదీర్ఘ కాలంగా నడుస్తున్న ఏకైక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని అన్నారు.అయితే నిజాయితీ,నైతిక విలువలు లేని పాలకుల వల్ల మాదిగ జాతి సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు.2014 ఎన్నికల సమయంలో కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నిలువెత్తు నమ్మక ద్రోహం చేసిందని అన్నారు.కనుక బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మొద్దు అని అన్నారు.ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ బిడ్డలు మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చార.అందులో భాగంగా జనవరి 11న ఎమ్మార్పీఎస్ జాతీయ మహాసభను నిర్వహిస్తున్నారని ఈ సభకు ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ గారు పాల్గొంటారని కావున మాదిగ మరియు ఉపకులాల బిడ్డలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఎస్పి మండల ఇంఛార్జి స్వామిదాస్ మాదిగ మండల కార్యదర్శి దవిద్ ప్రచార కార్యదర్శి ప్రశాంత్ సలహాదారుడు గుడిసె గోపాల్ ఎంఎస్ఎఫ్ నాయకులు కవిరజ్ ప్రవీణ్ ప్రసాద్ ఆనంద్ నరహరి రాజు కెవిపిస్ నాయకుడు గోపాల్ నవీన్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.