జనవరి 23న జిల్లా కేంద్రాల్లో మానవహారాలు విజయవంతం చేయాలి
- మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కృషి
- భారత పౌరుల ప్రాథమిక బాధ్యత
- మతోన్మాద దుండగులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షి
- స్వేచ్ఛ JAC
వికారాబాద్ : తెలంగాణ అన్ని జిల్లాల్లో జనవరి 23న జిల్లా కేంద్రాల్లో మానవహారాలు విజయవంతం చేయడం కోసం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.టీచర్లు,అంబేద్కర్ వాదులు,భౌతికవాదులూ,హేతువాదులు,నాస్తికులపై మతోన్మాదుల మూక దాడులను అరికట్టాలని,మతోన్మాద దుండగులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జనవరి 23వ తేదీన తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం 100కి పైగా రాజకీయ పార్టీలు,ప్రజాసంఘాలతో ఏర్పడిన స్వేచ్ఛ JAC ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు విద్యార్థి మహిళ ఉపాధ్యాయ యువజన హేతువాద నాస్తిక వైజ్ఞానిక పౌర సంస్థల తో కలిసి మానవహరాలను ఏర్పాటు చేస్తున్నది.
మతోన్మాద మూకదాడులను స్వేచ్ఛ JAC తీవ్రంగా ఖండిస్తున్నది
తెలంగాణ రాష్ట్రంలో టీచర్లు అంబేద్కర్ వాదులు హేతువాదులు నాస్తికులు వైజ్ఞానిక ప్రచారకులు ప్రజాసంఘాల నాయకులపై మతోన్మాదులు మూక దాడులు చేస్తున్నారు.భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కు.ఆ హక్కును కాపాడాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండడం శోచనీయం. ఎవరైనా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన మాట్లాడిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. చట్ట విరుద్ధంగా చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు.వైజ్ఞానిక దృక్పథం వైజ్ఞానికపరిశీలన పరిశీలన స్ఫూర్తి మానవవాదం సంస్కరణభిలాషను పెంపొందించడం భారత పౌరుల ప్రాథమిక బాధ్యత.ఆ బాధ్యతను నెరవేరుస్తున్న టీచర్లపై దాడులు చేయడం దారుణం బడులు ప్రభుత్వం నియంత్రణలో ఉన్నాయా? మతోన్మాదుల నియంత్రణలో ఉన్నాయా? మతోన్మాదులు బడుల్లో చర్చకు పోయి విద్యనే నాశనం చేయాలని చూస్తున్నారు.
భాగ్యోదయం భాగ్య రెడ్డి వర్మ జ్యోతిబా ఫూలే,అంబేద్కర్ ల స్పూర్తితో హైదరాబాద్ లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కృషి చేసిన దళిత నాయకుడు.ఆయన పాఠం చెప్పకుండా నిరోధించడం టీచర్లపై దౌర్జన్యం చేయడమే ఘర్హనీయం శిక్షణార్హం.తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మూక దాడులకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అంబేద్కర్ వాదులు హేతువాదులు నాస్తికులు, వైద్యానికి ప్రచారకులు రచయితలు కవులు కళాకారులు ఉపాధ్యాయులు మేధావులు న్యాయవాదులు అందరూ ఏకతాటిపైకి వచ్చి స్వేచ్ఛ జేఏసీ గా ఏర్పడి భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం ఐక్యంగా కృషి చేస్తున్నాం.తెలంగాణ ప్రజలందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ మనందరి హక్కు బాధ్యత కూడా ఇందుకోసం అందరం పెద్ద ఎత్తున కదలి మన హక్కులను కాపాడుకుందాం అందరూ కలిసి రావాలని స్వేచ్ఛ జేఏసి విజ్ఞప్తిచేస్తుంది.