మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన వారికీ 25యేళ్ల కఠిన కారాగార శిక్ష
హైదరాబాద్ : 2017లో మైనర్‌పై అత్యాచారం చేసి 2018లో మరో మైనర్‌పై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో మాజీ సైనికాధికారి బ్రిజేష్ కుమార్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు దోషిగా నిర్ధారించి,మొత్తం 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.4.25 లక్షల జరిమానా విధించింది.దోషిగా తేలిన వ్యక్తి భారత సైన్యంలోని సిగ్నల్ రెజిమెంట్‌లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ సిపాయి.ఈ రెండు ఘటనలు త్రిముల్‌గేరి పోలీస్ పరిధిలోని అమ్ముగూడ రైల్వేస్టేషన్‌కు సమీపంలోనే జరిగాయి.మొదటి నేరం తర్వాత, యాదవ్ పరారీలో ఉన్నాడు.జూలై 2018లో రెండవ నేరం సమయంలో అతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.దోషిగా తేలిన వ్యక్తి భారత సైన్యంలోని సిగ్నల్ రెజిమెంట్‌లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ సిపాయి.ఈ రెండు ఘటనలు త్రిముల్‌గేరి పోలీస్ పరిధిలోని అమ్ముగూడ రైల్వేస్టేషన్‌కు సమీపంలోనే జరిగాయి.మొదటి నేరం తర్వాత,యాదవ్ పరారీలో ఉన్నాడు.జూలై 2018లో రెండవ నేరం సమయంలో అతను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
రైల్వే స్టేషన్ దగ్గర ఉండే ఏకాంత ప్రాంతాల్లోని యువ జంటలను నిందితుడు టార్గెట్ చేసేవాడని పోలీసులు తెలిపారు.అతను తనను తాను ఇన్‌ఛార్జ్ అధికారి అని చెప్పుకునేవాడు.ఆ ప్రాంతంలో ఓ బాలుడిపై దాడి చేసి బాలికపై అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు.డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ పరీక్ష ఆధారంగా కోర్టు తన ఉత్తర్వులను ప్రకటించింది. ఐడెంటిఫికేషన్ పెరేడ్ నేరాలలో అతని ప్రమేయాన్ని రుజువు చేసింది.ఇదిలా ఉండగా,నల్గొండ జిల్లాలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది.సంక్రాంతి పండుగకు అమ్మమ్మగారి ఊరికి వెళ్లిన ఓ అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాదుకు చెందిన ఓ బాలిక పదవ తరగతి చదువుతోంది.
సంక్రాంతి పండుగ కోసం నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో ఉంటున్న అమ్మమ్మగారింటికి ఈనెల 13న వచ్చింది.సంతోషంగా పండగ జరుపుకుని తిరిగి హైదరాబాదుకు వెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో ముగ్గురు యువకులు ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు.వారు ముగ్గురు పెద్ద అడిచర్లపల్లి మండలం వడ్డేరి గూడెనికి చెందిన యువకులు నరేష్, శివ, దిలీప్ లు వారు అంతకుముందే అమ్మాయికి పరిచయం.దీంతో వారితోపాటు అంగడిపేట క్రాస్ రోడ్డు వద్దకు బాలిక వచ్చింది.అక్కడ కారు దిగిన బాలిక హైదరాబాద్ వెళ్లేందుకు బస్ స్టాప్ లో బస్సు కోసం ఎదురుచూస్తోంది.
కాగా ఆ ముగ్గురు యువకుల్లో నరేష్ కు బస్ స్టాప్ కు ఎదురుగానే బట్టల దుకాణం ఉంది.చాలాసేపు బస్సు కోసం ఎండలో ఎదురుచూస్తున్న ఆ అమ్మాయిని నరేష్ తన బట్టల షాపులోకి పిలిచాడు.అప్పటివరకు కారులో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి తెలిసిన వ్యక్తి కావడంతో ఆ అమ్మాయి అతని దుకాణంలోకి వెళ్ళింది.అప్పటికే అక్కడ మిగిలిన ఇద్దరు యువకులు ఉన్నారు.బాలిక దుకాణంలోకి వచ్చిన కొంత సమయం తర్వాత ఆమె స్పృహ తప్పి పడిపోయిందని చెబుతూ ఆ ముగ్గురు యువకులు ఓ స్థానిక డాక్టర్ దగ్గరికి ఆమెను తీసుకువెళ్లి చూపించారు.ఆమెను పరీక్షించిన డాక్టర్ వెంటనే దేవరకొండకు తీసుకువెళ్లాలని చెప్పాడు. ముగ్గురు యువకులు ఆమెను దేవరకొండకు తీసుకెళ్లి డాక్టర్లకు చూపించక బాలిక అప్పటికే మృతి చెందిందని వారు నిర్ధారించారు.
బాలిక మృతి చెందడంతో నరేష్,శివ,దిలీప్ లు భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు.దీంతో స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న దేవరకొండ డిఎస్పి నాగేశ్వరరావు అక్కడి పరిసరాలను పరిశీలించారు.మృతదేహాన్ని కూడా పరిశీలించి విచారణ చేపట్టారు.ఈ షా మృతదేహాన్ని కూడా పరిశీలించి విచారణ చేపట్టారు ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.ముగ్గురి యువకులు బాలిక మీద అత్యాచారం చేశారని తేలింది. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావం అయింది. ఆకారణంగానే బాలిక మృతి చెందిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. తన కూతురి మీద అఘాయిత్యం చేసి హత్య చేశారని బాలిక తండ్రి ఆ ముగ్గురు యువకుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నారు దీనిమీద దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.