Type Here to Get Search Results !

Sports Ad

కేజీబీవీ వేతనాలను 26వేలకు పెంచాలి In Vikarabad

 

కేజీబీవీ వేతనాలను 26వేలకు పెంచాలి

- అధికారులకు వినతి పత్రం అందజేసిన నాన్ టీచింగ్ వర్కర్స్   
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.గీత 
- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
- తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ : కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ వేతనాలను 26వేల రూపాయలకు పెంచాలి,వారిని పర్మినెంట్ చేయాలి ఫిబ్రవరి 3 తారీకు నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కేజీబీవీ సిబ్బంది సమస్యలపై చర్చించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మరియు తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారిని కోరడమైనది.కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ కనీస వేతనాలను పెంచాలని,కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.గీత డిమాండ్ చేశారు.మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి,మరియు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల మేడం గారికి  వినతి పత్రం అందజేశారు. 

         ఈ సందర్భంగ  ఎమ్మెల్యే గారితో వర్కర్స్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీలలో కనీస వేతనాలు అమలు చేయాలని తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26 వేల రూపాయలకు పెంచాలని,పిఎఫ్,ఈఎస్ఐ,గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు.కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానన్న కేసీఆర్ ప్రభుత్వ హామీని కేజీబీవీ లలో కూడా అమలు చేయాలని వారిని పర్మినెంట్ చేయాలని కోరారు. చట్టబద్ధ హక్కులు లేకుండా కార్మికులు పనిచేస్తున్నారని వీరికి భద్రతతో కూడిన హక్కులు కల్పించాలని అన్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో పని భారం పడి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, అప్ గ్రేడ్ అయిన పాఠశాలలో  అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.KGBVలలో కనీస వేతనాలు అమలు చేయడం లేదు అన్నారు ఏఎన్ఎం లకు వారంలో మూడు రాత్రి డ్యూటీలు వేయడాన్ని రద్దు చేయాలని,2వ ఏఎన్ఎంను నియమించాలని,ప్రతి స్కూల్ కి ఒక వెహికల్ ని,హాస్టల్ కు ఫైర్ సేఫ్టీ నీ ఏర్పాటు చేయాలని  కోరారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది పద్మ,కళావతి, శైలజ,నర్సమ్మ,లక్ష్మి,బాలమనీ,కవిత,మమత,ఇందుబాయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies