Type Here to Get Search Results !

Sports Ad

నిరుద్యోగులకు శుభవార్త పోస్టాఫీసుల్లో 40,889 పోస్టులు Post Office jobs

 

పోస్టాఫీసుల్లో 40,889 పోస్టులు 

ఉద్యోగులు : దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టాఫీసుల్లో 40,889 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు.ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం),డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్లో 2,480, తెలంగాణలో 1,266 ఖాళీలు ఉన్నాయి.ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది.వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు.ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది.వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది.సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి సైకిల్ తొక్కడం రావాలి.

మొత్తం ఖాళీల సంఖ్య: 40,889

1) గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్/ డాక్ సేవక్ సర్కిల్ వారీగా ఖాళీలు

ఆంధ్రప్రదేశ్- 2,480

తెలంగాణ- 1,266

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి.  అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.

వయసు : 16.02.2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు,ఓబీసీలకు మూడేళ్లు,దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు : ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు,ట్రాన్స్ ఉమెన్లకు ఫీజు చెల్లింపు లేదు.మిగిలిన అభ్యర్థులు రూ.100/- వంద చెల్లించాలి.

ఎంపిక విధానం : అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్/ అన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్షన్ 1 తర్వాత దానికి ఆప్షన్ 2... ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది

జీత భత్యాలు : నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380, ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.

బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం) : ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బ్రాంచ్ను నడిపించాలి. పోస్టల్ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్(ఏబీపీఎం) : ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్ పోస్టుమాస్టర్ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.

డాక్ సేవక్ : ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్ సర్వీస్, పోస్టల్ పేమెంట్ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్ పథకాలు ప్రచారం చేయాలి.

దరఖాస్తు విధానం : దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 27.01.2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ : 16.02.2023.

దరఖాస్తు సవరణలకు అవకాశం : 17.02.2023 నుంచి 19.02.2023 వరకు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies