Type Here to Get Search Results !

Sports Ad

ఫిబ్రవరి 5 మహాసభ,లంబాడీ హక్కుల పోరాట సమితి Date Feb 5th LHPS

 

ఫిబ్రవరి 5 మహాసభ,లంబాడీ హక్కుల పోరాట సమితి


- LHPS జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయండి
- లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ (LSO) జిల్లా అధ్యక్షుడు శివవర్మ నాయక్
- భవిష్యత్తు కార్యాచరణ రూపకల్పన

మహబూబాబాద్ : ఫిబ్రవరి 5 ఆదివారం మహబూబాబాద్ జిల్లా కురావి మండలం లో లంబాడీ హక్కుల పోరాట సమితి (LHPS)  మహబూబాబాద్ జిల్లా 3 వ మహాసభలు జయప్రదం చేయాలని,పట్టణ కేంద్రంలోని  ముఖ్య కార్యకర్తల సమావేశం  జిల్లా ఉపఅధ్యక్షుడు రమేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది.LSO జిల్లా అధ్యక్షులు శివవర్మ నాయక్ పాల్గొని  మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా అతి పెద్ద గిరిజన జిల్లా,వెనుకబడిన జిల్లా ఈ జిల్లాలో అనేక సమస్యలు తో గిరిజనులు సతమవుతున్నారని అన్నారు.బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని,మానుకోట జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఉన్న గిరిజనులు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి పొడు భూములకు పట్టాలి ఇవ్వాలని అన్నారు.

జిల్లాలోని గిరిజనుల భూములు గుంజుకోవడం దారుణమన్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు గిరిజనులు అయినప్పటికీ గిరిజన జిల్లా ఇంకా అభివృద్ధి చెందలేదు అన్నారు,కురవి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అటవీ సంపదను మొత్తం కార్పొరేట్ అదని అంబానీ లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు.గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు.వచ్చే ఎన్నికల్లో వారిని ఓడిస్తామని అన్నారు.ఈ జిల్లా మహాసభలలో చర్చించుకుని గద్దె దింపుతామని  ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో LSO జిల్లా నాయకులు రాంబాబు,నితిన్,సునీల్,విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies