51 రోజులు 20లక్షలు...అతి పెద్ద పర్యాటక నౌక
- ప్రపంచంలోనే అతి పెద్ద పర్యాటక నౌక Ganga Vilas
ఢిల్లీ Delhi : ప్రపంచంలోనే అతి పెద్ద నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.వారణాసిలో మొదలైన ఈ గంగా విలాస్ ప్రయాణాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన మోదీ భారత్‌లో కొత్తతరం పర్యాటకానికి ఇది నాంది పలుకుతోందన్నారు.అంతేకాకుండా ఇది కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు.దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి నదీ పర్యాటక నౌకలు రానున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా విదేశీ పర్యాటకులకు ఆహ్వానం పలికిన మోదీ తద్వారా భారత్ గొప్పతనాన్ని స్వయంగా ఆస్వాదించవచ్చని పిలుపునిచ్చారు.భారత్‌లో తయారైన ఈ తొలి నౌక Ganga Vilas లో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులు మొదటి ప్రయాణాన్ని చేయనున్నారు.వారణాసి నుంచి మొదలై అసోంలోని దిబ్రూగఢ్ వరకు వీరి ప్రయాణం సాగుతుంది.
మధ్యలో బంగ్లాదేశ్ జలాల్లోనూ ఈ నౌక పయనిస్తుంది.రెండు దేశాల్లో 27 నదుల గుండా సాగే గంగా విలాస్ ప్రయాణ మార్గంలో 50 ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంటుంది.18 సూట్లు ఉండే ఈ నౌకలో 36 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు.మూడు సన్‌డెక్‌లు,జిమ్ సెంటర్‌తోపాటు స్పా వంటి లగ్జరీ సదుపాయాలు ఉన్నాయి.51 రోజుల పాటు 3200 కి.మీ దూరం సాగే ఈ ప్రయాణంలో ఒక్కొక్కరికి ప్రతి రోజు రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు ఖర్చవుతుంది.మొత్తంగా 51 రోజుల ప్రయాణానికి ఒక్కొక్కరికి సుమారు రూ.13 లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఖర్చు అవనున్నట్లు క్రూజ్ నిర్వాహకులు వెల్లడించారు.భారత్,బంగ్లాదేశ్‌లలో సాగే ఈ యాత్రలో వారణాసిలోని గంగా హారతి,విక్రమశిల యూనివర్శిటీ,సుందర్బన్ డెల్టా,కజీరంగా నేషనల్ పార్కు సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను చూడొచ్చని తెలిపారు.