Type Here to Get Search Results !

Sports Ad

76 GO ఇంటి పట్టాల పై సర్వే టీమ్ లు రాబోతున్నాయి MLA Vanama

 

 శ్రీ శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్ట మహోత్సవాలో పాల్గొన్న ఎమ్మెల్యే వనమా

సుజాతనగర్ : సుజాతనగర్ గ్రామంలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరై,పూజలు చేసి,స్వామివారి దీవెనలు తీసుకొన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు.ఎమ్మెల్యే వనమా వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్య రాంబాబు,ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య,సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు,ఎంపీటీసీ మూడ్ గణేష్,సర్పంచ్ హథిరాం,బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ (సంపు), డైరెక్టర్లు నెహ్రూ, గాజుల సీతారామయ్య, రవీందర్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు కృష్ణార్జున రావు, రవి, బావు సింగ్, ఆరిఫ్ ఖాన్, గడ్డం వెంకటేశ్వర్లు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గుడి కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు, భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



76 GO ఇంటి పట్టాల పై సర్వే టీమ్ లు రాబోతున్నాయి వాటిని వినియోగించుకోండి


కొత్తగూడెం పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి నివసిస్తున్న అనేక వేల మందికి 76 జీఓ ద్వారా ఇండ్ల క్రమబద్ధీకరణ చేసి పట్టాలి ఇవ్వడం జరిగింది. అనంతరం రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించడం జరిగింది.ఎన్నో సంవత్సరాల నుంచి అనేకమంది కొత్తగూడెం పట్టణం లోని సింగరేణి భూభాగం లో 141, 142, 143 సర్వే నంబర్లలో నివసిస్తున్నారు,అలానే వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాంటి వారికి  సర్వే చేసి అర్హులైన వారికి ఈ 76 జీఓ ద్వారా న్యాయం చేయడం జరిగింది.ఇంకా కొంతమంది అర్హులైన వారు పట్టాలు పొందలేదు.
కాబట్టి వారు పట్టాలు పొందెందుకు మరల 76 జీవో ఆన్లైన్ సమయాన్ని ఎక్స్టెండ్ చేయించడం జరిగింది.


దాదాపుగా 1536 మంది ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సర్వే టీంలు అన్ని వార్డులకు పంపించి ఎంక్వయిరీ చేయించడం జరిగింది. ఈ సార్లో *దాదాపుగా 450 మందిని మాత్రమే అర్హులుగా నిర్ణయించడం జరిగింది.కానీ దాదాపుగా ఇంకా వెయ్యి మంది అర్హులైన వారి దరఖాస్తులు తిరస్కరించడం జరిగింది.సర్వే టీం వారికి అవగాహన లేక సరిగా సర్వే చేయలేదని   కొంతమంది అర్హుల దరఖాస్తులు తిరస్కరించినట్లు నా దృష్టికి తీసుకువచ్చారు.దరఖాస్తుదారులు ఇంట్లో లేనప్పుడు కొన్ని, ఇంటి పత్రాలు సరిగా పరిశీలించక కొన్ని తిరస్కరించడం జరిగింది.ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారి తోటి మాట్లాడి 17 సర్వే టీం లు ఎంపిక చేసి ప్రతి ఇంటికి రీసర్వే చేసి అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.మరో రెండు రోజుల్లో సర్వే టీం లు వచ్చి రిజెక్ట్ అయిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హులైన వారికి పట్టాలందిచే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ ఆఖరి అవకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తుదారులందరూ సరైన పత్రాలు సర్వే టీం వారికి అందించి పట్టాలు పొందాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies