రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న ఆప్,బీఆర్ఎస్
- పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
- రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జాతీయం National : దేశ ప్రగnతిలో యువశక్తి,నారీశక్తి భాగస్వామ్యం కావాలి.పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలి రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం.ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించుకుందాం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంతో పార్లమెంట్ సెషన్స్‌ను ప్రారంభించారు.భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్రం పాలనలో అన్ని రంగాల్లో విఫలమైనందుకు నిరసనగా పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత కే.కేశవరావు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఈ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. సమావేశాల తొలిరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పాలనలో అన్ని రంగాల్లో విఫలమైనందుకు నిరసనగా తమ పార్టీ బహిష్కరణ చర్యలు తీసుకుంటోందని రాజ్యసభలో భారత రాష్ట్ర సమితి ఫ్లోర్ లీడర్ కేశవరావు తెలిపారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగ బహిష్కరణలో ఆప్ కూడా బీఆర్ఎస్ తో చేరుతుందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ అధినేత,తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని విపక్షాల కూటమిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.ఈ క్రమంలోనే దేశంలోని ఇతర పార్టీలతో కలిసి మరో కూటమి దిశగా ఆయన అడుగ వేయనున్నారు.బీఆర్‌ఎస్,ఆప్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించగా కొందరు కాంగ్రెస్ ఎంపీలు భారత్ జోడో యాత్ర ముగింపులో పాల్గొని శ్రీనగర్‌లో మంచు కారణంగా చిక్కుకుని హాజరు కాలేకపోయారు.