Type Here to Get Search Results !

Sports Ad

రక్తహీనత(Anemia) పోవాలంటే ఇలా చేయండి For Good health

 

రక్తహీనత(Anemia) పోవాలంటే ఇలా చేయండి

ఈ ఐదింటిని డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత మాయం

రక్తంలో హీమోగ్లోబిన్‌,ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉండటాన్ని రక్తహీనతగా పిలుస్తారు.రక్తంలోని హీమోగ్లోబిన్‌ మన శరీరంలోని అన్ని భాగాలకు,కణాలకు ఆక్సిజన్‌ను అందిస్తుంది.హీమోగ్లోబిన్‌ లెవల్స్ పడిపోయిన వారిలో రక్తం శరీర అవయవాలకు అందక శరీరం చచ్చుబడిపోయేలా మారుతుంది.అనీమియాతో బాధపడుతున్నవారిలో తలనొప్పి,అలసట,శ్వాస తీసుకోలేకపోవడం,ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.చర్మం,గోర్ల భాగం రంగు వెలిసిపోయినట్లుగా తయారవుతాయి.మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.మనం తీసుకొనే అసమతౌల్య ఆహారం వల్ల ఐరన్,ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ బి లోపం వల్ల అనీమియా వస్తుంది. కొంత మంది మలంలో రక్తం పడటం కూడా అనీమియాకు కారణం అవుతుంది.

1. రెగ్యులర్‌ డైట్‌లో ఐరన్‌ ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం ద్వారా అనీమియా రాకుండా చూసుకోవచ్చు.ఐరన్ అధికంగా లభించే ఆకు కూరలు,లివర్,ద్రాక్ష,నల్లనువ్వులు ఎక్కువగా తీసుకోవాలి.చేపలను రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఎక్కువ ఐరన్‌ మన శరీరానికి అందుతుంది.ఐరన్‌తో పాటు శరీరానికి అవసరమైన ఒమేగా-3 ప్రోటీన్లు కూడా లభిస్తాయి.

2. డ్రైఫ్రూట్స్‌,విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందడానికి జీడిపప్పు,పొద్దుతిరుగుడు విత్తనాలు,గుమ్మడి గింజలు,పిస్తా,అక్రోట్లను,వేరుశెనగ,బాదం వంటి గింజలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.ఇవి శరీరంలోని ఇనుము లోపాన్ని తీర్చడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి కూడా మనల్ని రక్షిస్తాయి.

3. గుడ్లు ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ కలిగి వుంటుంది.శరీరాన్ని నిర్మించాలన్నా,రక్తహీనత సమస్యను తొలగించాలన్నా గుడ్లు చాలా ఉపయోగపడతాయి.వృద్ధాప్య ప్రక్రియను మందగించడానికి గుడ్లు తీసుకోవడం చాలా ముఖ్యం.

4. మన రోజూవారి ఆహారంలో బీన్స్,పప్పుధాన్యాలు ఉన్నట్లయితే మనలో రక్తహీనత సమస్య రానేరాదని పోషకాహార నిపుణులు సెలవిస్తున్నారు.అందువల్ల వీలైనంత ఎక్కువగా వీటిని భోజనంలో తినాలి సలాడ్‌గా కూడా వడ్డించవచ్చు.

5. నల్ల నువ్వుల్లో ఐరన్ అధికంగా ఉంటుంది.వీటిని నేరుగా అలాగే తీసుకోవచ్చు.లేదా స్వీట్  డిష్ లలో చిలకరించి తీసుకోవచ్చు.ఇది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది.అనీమియాను తగ్గించడంలో ఇది ప్రకృతి ప్రసాదించిన పదార్థం.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies