Type Here to Get Search Results !

Sports Ad

హీరో బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్‌ ఫైర్‌

 

హీరో బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్‌ ఫైర్‌

- హాస్యగా మాట్లాడిన మాటలు వివాదం 
- వీరసింహారెడ్డి సినిమా సక్సెస్‌ మీట్‌లో

హైదరాబాద్ Hyderabad : నందమూరి బాలకృష్ణ Nandhamuri Balakrishna చేసిన వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్‌ ఫైర్‌ అయ్యారు.బాలకృష్ణ మాట్లాడుతూ 'అక్కినేని తొక్కినేని' అంటూ అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ మాట్లాడారు అని నాగేశ్వరరావు మనవళ్లు, హీరో నాగచైతన్య Naga chaithanya,అఖిల్‌ Akhil స్పందించారు.వారిని అగౌరపరచడం మనల్ని మనం కించ పరుచుకోవడమే అన్నారు.నందమూరి తారక రామారావు గారు,అక్కినేని నాగేశ్వరరావు గారు,ఎస్వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు.వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం అని నాగచైతన్య,అఖిల్‌ ట్వీట్‌ చేశారు.వీరసింహారెడ్డి సినిమా సక్సెస్‌ మీట్‌లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.సినిమా షూటింగ్‌ టైమ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ అందరూ అద్భుతంగా నటించారు.నాకు మంచి టైం పాస్ ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు,నాన్నగారు, డైలాగులు,ఆ రంగారావు ఈ అక్కినేని,తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం అని బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు ఈ వాఖ్యలే వివాదాస్పదమవుతున్నాయి దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies