Type Here to Get Search Results !

Sports Ad

దేశంలో రైతు సర్కారు బిఆర్ఎస్ పార్టీ లక్ష్యం BRS Party

 


దేశంలో రైతు సర్కారు బిఆర్ఎస్ పార్టీ లక్ష్యం

- బిఆర్ఎస్ తొలి బహిరంగ సభను విజయవంతం చేద్దాం
- తెలంగాణ అభివృద్ధిని దేశానికి సందేశంగా ఇద్దాం
-దేశంలో ఎవరూ చేయలేని పథకాలు అమలు సీఎం కేసీఆర్
- పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి, తొర్రూరు, పెద్ద వంగర
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,కడియం శ్రీహరి

పాలకుర్తి : దేశంలో రైతు సర్కారు లక్ష్యంగా ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈనెల 18వ తేదీన ఖమ్మంలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభను విజయవంతం చేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీతి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు,పూర్వ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి గారు పిలుపునిచ్చారు.తెలంగాణ అభివృద్ధి దేశానికి సందేశంగా ఈ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి,ప్రధానమంత్రి అమలు చేయని,కనీసం అమలు చేయడానికి సాహసించని పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేసి,విజయవంతం చేశారన్నారు.


 పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి,తొర్రూరు,పెద్ద వంగర మండల పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాలకుర్తి నియోజకవర్గంలో 120 గ్రామాలకు గాను 80 గ్రామాలకు కాలువల ద్వారా సాగునీరు అందించాను.మిగిలిన గ్రామాలకు కూడా అతి త్వరలో సాగునీరు అందుతుంది.కాలువల ద్వారా నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసులు వేసి, ర్టులకి ఎక్కి అనేక అడ్డంకులు సృష్టించారు.ఇప్పుడు అవన్నీ అధిగమించాము పాలకుర్తి అంతా కాలేశ్వరం నీరు పారుతుంది.పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయి ఇచ్చిన హామీ పూర్తిగా  నెరవేరుతుంది.పాలకుర్తి ప్రజలకు కూడా నీరు వస్తుందని నమ్మకం కుదిరింది.పాలకుర్తిలో అనేక అభివృద్ది కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నాం.

పాలకుర్తికి గొప్ప చరిత్ర ఉంది బమ్మెర పోతన భాగవతం రాశారు.800 ఏళ్ల కింద ఇక్కడ ఆయన వ్యవసాయం చేశారు.బమ్మెరలో 4 ఎకరాల స్థలం ఉన్నది. దానిని కొనాలి అని పాపారావు, పాండురంగ రావు నా దగ్గరకు వచ్చారు. 12 ఏళ్ల కింద లక్ష రూపాయలు ఇచ్చాను.వ్యవసాయం చేస్తూ భాగవతం రాసిన కవిని ఎవరూ పట్టించుకోలేదు.సీఎం కేసీఆర్ గారి దగ్గరకు తీసుకెళ్తే సీఎం స్వయంగా వచ్చి 6 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అయ్యింది.ఇప్పుడు ఆయన సమాధి, స్మృతి వనం, విగ్రహంతో పాటు సరస్వతి ఆలయం నిర్మాణం చేస్తున్నాం.అక్షర అభ్యాసం చేయవచ్చు దానిని టూరిజం క్షేత్రంగా చేస్తున్నాం.వల్మిడిలో వాల్మీకి రామాయణం రాశారు 3500 ఏళ్ల నాటి మన చరిత్ర అది.మా పూర్వీకులు వెళ్ళేది కానీ ఎవరూ పట్టించుకోలేదు.




సీఎం కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే 15 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.శ్రీరామ నవమి రోజున వల్మిడి దేవాలయం ప్రారంభం చేస్తున్నాం వాల్మీకి పెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం.మీరంతా రాముల వారి కళ్యాణానికి ఇంటినుంచి తలంబ్రాలు తేవాలి.మొదటి కవి పాల్కురికి సోమనాథుడు ఆయన విగ్రహం 10 కోట్లతో ఏర్పాటు చేయించాం 15 కోట్లతో పాలకుర్తి అభివృద్ది చేశాం.శివ రాత్రికి ఈ విగ్రహం ఆవిష్కరణ చేసి,అభివృద్ధి పనులు ప్రారంభం చేస్తున్నాం.పాలకుర్తిలో 25 కోట్ల రూపాయలతో టూరిజం పెద్ద హరిత హోటల్ కట్టిస్తున్నాం.వానకొండయ్య లక్ష్మి నరసింహస్వామి ఆలయం 5 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ది చేస్తున్నాం. గిరిజనుల ఆరాధ్య దైవం ఈ వాన కొండయ్య లక్ష్మి నరసింహస్వామి.గిరిజనుల సద్గురు సేవాలాల్ మహారాజ్ పుస్తకం చదివాను.ఆయన గుడి కట్టాలని పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో 5 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చి, 5 కోట్ల రూపాయలతో గుడి కట్టిస్తున్నాం.

సేవాలాల్ ను ఆదర్శంగా తీసుకోవాలి. సేవాలాల్ పాలకుర్తికి కూడా వచ్చారట.కాబట్టి రాష్ట్రంలో నంబర్ వన్ గుడి కడుతున్నాం చెన్నూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం గొప్పది. మా  తాతలు, తండ్రుల వారసత్వం ఉంది.పది కోట్లు పెట్టీ అభివృద్ది చేస్తున్నాం.ఈ నెల 18న ప్రారంభం అయ్యే కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

క్యాంప్ లో పరీక్ష చేసిన వెంటనే రీడింగ్ గ్లాసెస్ ఇస్తారు.వేరే సమస్య ఉంటే పరీక్ష చేసి 15 రోజుల్లో అద్దాలు ఇస్తారు.ఇంటింటికి వెళ్లి అందరినీ తీసుకొచ్చి పరీక్షలు చేయించే బాధ్యత నాయకులదే.మీరు కార్యక్రమాన్ని సొంతంగా భావించాలి ఆ డాక్టర్లకు మంచి శిక్షణ ఇచ్చారు.క్యాంప్ ఉండే రోజుని బాగా ప్రచారం చేయాలి 100 రోజుల కార్యక్రమం ఇది వసతులు అన్ని కల్పించాలి.సర్పంచ్,ఎంపీటీసీ,జెడ్పీటీసీ,ఎంపీపీ,ముఖ్య నాయకులు అంతా అక్కడే ఉండాలి.దీనిని సద్వినియోగం చేసుకోవాలి 18న బిఆర్ఎస్ తొలి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని కోరుతున్నాను.



ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ 

టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మారిన తరవాత దేశానికి సందేశం ఇవ్వడానికి ఖమ్మంలో  సీఎం కేసీఆర్ గారు పెద్ద సభ పెడుతున్నారు.5 లక్షల మందితో ఈ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు.ఇందులో మహబూబాబాద్ జిల్లా నుంచి లక్ష మంది తీసుకువెళ్ళాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం.పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ సంస్థాగతంగా పటిష్టంగా ఉంది. సంస్థాగత నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పెద్ద పీట వేశారు.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు వారికి పని చేస్తారు.పని చేయించుకుంటారు.సుశిక్షితులు అయిన కార్యకర్తలు ఉన్నారు అందుకే పరిశీలకునిగా నా పని సులువు అయ్యింది.పాలకుర్తి నియోజకవర్గం దయాకర్ రావు గారి నాయత్వములో బ్రహ్మాండంగా అభివృద్ది చెందింది.

పంచాయతీ రాజ్,గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు,ఇతర నిధులు అన్ని ఈ నియోజక వర్గంలోనే ఖర్చు చేస్తున్నారు.గతంలో ఈ నియోజక వర్గంలో సరైన అభివృద్ది జరగలేదు నా నియోజక వర్గం రుణం తీసుకోవాలి అనే తపనతో దయాకర్ రావు గారు అభివృద్ది చేస్తున్నారు.బిఆర్ఎస్ బహిరంగ సభకు క్రమశిక్షణతో రావాలి పార్కింగ్ కోసం క్యు.ఆర్ కోడ్ ఇస్తున్నారు.దాని ప్రకారం మీరు వెళ్ళాలి జాగ్రత్తగా తీసుకెళ్లాలి.అంతే జాగ్రత్తతో తీసుకు రావాలి రేపు ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా లక్ష ఓట్ల మెజారిటీతో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గెలుస్తాడు.కాబట్టి పక్క నియోజక వర్గాలను కూడా గెలిపిస్తే మూడోసారి ముచ్చటగా కేసిఆర్ గారు సీఎం అవుతారు.ఇందుకోసం సమిష్టిగా పని చేయాలి బిజెపి,కాంగ్రెస్ పార్టీలు మనకు దరి దాపుల్లో కూడా లేవు.

 అవి పేపర్ టైగర్లు కింద డొల్లలు సంస్థాగతంగా నిర్మాణం లేదు వాటికి కాంగ్రెస్ కు సరైన నాయకత్వమే లేదు.వీరి పట్ల తెలంగాణ ప్రజలకు నమ్మకమే లేదు.కాబట్టి కేసిఆర్ గారి నాయకత్వం మీదే తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది.ఇటీవల చేసిన సర్వేలో కూడా 90 కి పైగా సీట్లు వస్తాయని వచ్చింది.తెలంగాణ రాకముందు,వచ్చిన తరవాత ఎలాంటి అభివృద్ది జరిగింది అని మనం బేరీజు వేసుకోవాలి.ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలి 24 గంటల ఉచిత కరెంట్ అంటే ఏటా 10,500 కోట్ల రూపాయలు డిస్కం లకు చెల్లిస్తున్నాం.ఒక్కొక్కరి మీద కనీసం 50 వేల నుంచి లక్ష రూపాయిలు చెల్లిస్తున్నాం.63 లక్షల మంది రైతులకు 15వేల కోట్ల రూపాయలు రైతు బందు కింద రైతు పెట్టుబడి సాయం చేశాం.ఇప్పటికీ 58వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చాం దళిత బంధు ఇస్తున్నాం.

వచ్చే బడ్జెట్ లో గిరిజన బడ్జెట్ ఇవ్వబోతున్నారు సీఎం కేసీఆర్ గారు.పాలకుర్తి, జాఫర్ ఘడ్, కొడకండ్ల, ఘన్ పూర్ ప్రాంతాలు డార్క్ ఏరియాగా ప్రకటించారు బోర్లు వేయొద్దు అన్నారు వేసినా నీరు రాలేదు.కానీ తెలంగాణ వచ్చాక, కాళేశ్వరం తెచ్చాక నేడు బోర్ల నిండా నీళ్ళు వస్తున్నాయి. నిండుగా కాలువలు పారుతున్నయి ఇలాంటి పాలనను భారత దేశంలో ఎందుకు ఇవ్వలేము? అని ఆలోచించి సీఎం కేసీఆర్ గారు బి.ఆర్.ఎస్ పార్టీ పెట్టారు.తెలంగాణలో సాధ్యం అయ్యింది దేశంలో చేయాలనేది సీఎం సంకల్పం.దేశంలో ఉన్న నాయకులకు దూర దృష్టి, ఆలోచన, సంకల్పం లేక ఏమి జరగ లేదు.ఈ అజెండాతో పెట్టే బి.ఆర్.ఎస్ మొదటి బహిరంగ సభ. మీరు అంత వచ్చి విజయవంతం చేయాలి ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు,వివిధ గ్రామల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు,ఎంపీటీసీలు,రైతు బంధు సమన్వయ కర్తలు,పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies