గిరిజన సంక్షేమ హాస్టల్ విషయంపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.
జూలూరుపాడు : BSSM తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు తెలిపిన ప్రకారం భారతీయ సర్వ సమాజ్ మహసంఘ్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన సంక్షేమ హాస్టల్ లలో ఫుడ్ పాయిజన్ అవుతుంది.అనేక మంది పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారు అని జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. స్పందించిన కమిషన్ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి పంపించడం జరిగింది.పడమటి నర్సాపురం గ్రామం,జూలూరుపాడు మండలంలో జరిగిన సంఘటన పై పూర్తి విచారణ జరిపి రిపోర్ట్ రాయాలని జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.