Type Here to Get Search Results !

Sports Ad

చేదువార్త అందించిన కేంద్ర ప్రభుత్వం The central government gave a bad news

 

చేదువార్త అందించిన కేంద్ర ప్రభుత్వం

- పెరిగిన ధరలతో కష్టంగా బ్రతుకుతున్న ప్రజలు
- వెన్ను పోటు పొడుస్తున్న కేంద్రం 

వెబ్ న్యూస్ : కొత్త సంవత్సరంలో సంతోషంగా గడుపుదాం అనుకునేలోపే వెన్ను పోటు.శుభమా అని కొత్త సంవత్సరంలోకి ఇలా అడుగు పెట్టగానే కేంద్రం బాంబ్ పేల్చింది.ఇప్పటికే పెరిగిన ధరలతో కష్టంగా బ్రతుకుతున్న సామాన్య ప్రజలపై మరో భారం మోపింది.కమర్షియల్ సిలిండర్ ధరను రూ.25 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆ సంస్థలు వెల్లడించాయి.రెస్టారెంట్లు, ఇతర వాణిత్య సంస్థలపై ప్రభావం చూపనుంది.దేశ రాజధాని న్యూఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1768కి చేరింది.ముంబైలో రూ.1721కి పెరగ్గా కోల్కతాలో రూ.1870కి, చెన్నైలో రూ.1917కి గరిష్టంగా చేరింది. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

ప్రస్తుతం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1105గా ఉంది. గతేడాది జనవరిలో సిలిండర్ ధర రూ. 952 ఉండగా డిసెంబర్ నాటికి అది రూ. 1105కి చేరింది.ఇతర చమురు కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన పెట్రోల్,డీజిల్,ఎల్పీజీ గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి.ఈ క్రమంలోనే నేటి నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడానికి నిర్ణయం తీసుకున్నాయి.కేవలం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పరిశీలిస్తే 2022 మొదట్లో రూ.952గా ఉండేది. అయితే మార్చిలో రూ. 50 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఆ తర్వాత వెంటనే మే నెలలో రెండోసారి రూ. 50 పెంచేశాయి. అదే నెలలో మళ్లీ రూ.3.50 ధర పెరిగింది.చివరి సారిగా జులై రూ.50 పెరగడంతో ప్రస్తుతం దాని ధర రూ.1105గా ఉంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies