కామంతో తండ్రి కన్నా కూతురిని గర్భం చేశాడు
క్రైమ్ : కన్నావాలని అని చూడకుండా కామంతో ఉన్నాడు రాక్షస తండ్రి.ఓ తండ్రి కామంతో కూతురి పైనే కన్నేశాడు.భార్య చనిపోవడంతో కూతురిని లొంగదీసుకుని తన కోరికలను తీర్చుకున్నాడు. చివరకు ఆ బాలిక గర్భిణి అని తేలడంతో అందరూ షాక్ అయ్యారు.ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని షాద్ నగర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం 40 ఏండ్ల వయసున్న ఓ వ్యక్తి భవన నిర్మాణ రంగ కార్మికుడిగా పని చేస్తున్నాడు.ఆయన భార్య మూడేండ్ల క్రితం చనిపోయింది.కూతురి (14)తో కలిసి అతను షాద్ నగర్ లో ఉంటున్నాడు.అయితే మద్యానికి బానిసగా మారిన ఆ వ్యక్తి కూతురిపైనే కన్నేశాడు.గత ఆరు నెలల నుంచి ఆ బాలికపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.అయితే గురువారం స్కూలు వెళ్లిన విద్యార్థిని ఆస్వస్థతకు గురైంది.ఈ క్రమంలో ఆమెను టీచర్లు హాస్పిటల్ కి తీసుకెళ్లగా,గర్భిణి అని తేలింది.దీంతో టీచర్లు,తోటి విద్యార్థినులు షాక్ గురయ్యారు.ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.