జర్నలిస్టులకు విమర్శలే బలం
- నిరంతరం పోరాడేవాడు జర్నలిస్టు
- కష్టానికి తగిన ఫలితం వస్తుందనే నమ్మకం లేదు
- ఆకలి వేస్తే తినడానికి సమయం ఉండదు
- జర్నలిస్టులను గౌరవిధం,ఆదుకుందాం,అండగా ఉందాం
బిఎచ్డి(BHD) ప్రతినిధి : ప్రతి క్షేణం,ప్రతి నిమిషం ప్రజల సంతోషాల కోసం పోరాడే వాళ్లు జర్నలిస్టు.అక్కడైతే అన్యాయం ఉందో నిజాని వెలికి తీసేవాడే జర్నలిస్టు వాటి కోసం కలం పట్టేవారు జర్నలిస్టు.జర్నలిస్టుగా ఉన్న వాడికి విమర్శలే బలం ఎవరో ఏదో అంటారని భయమున్నప్పుడు నీ మెదడులోంచి జర్నలిస్టు అన్న ఆలోచన తీసేసి,ఈ వృత్తిని వదిలేసి ఇంట్లో కూర్చోవాలి.మిగతా రంగాలలో రాణించినంత సులువు కాదు జర్నలిజంలో ఉండడం.24గంటలూ ప్రాణం పణంగా పెట్టాల్సి ఉంటుంది.అయినా కష్టానికి తగిన ఫలితం వస్తుందనే నమ్మకం ఉండదు.కేవలం మనల్ని నమ్ముకుని ఉన్నవాళ్లకు మూడు పూటలా అన్నం పెట్టగలుగుతున్నాం అనే చిన్న ఆశతోనే ఇక్కడ నిలబడవలసి వస్తుంది.సమస్యను పరిష్కరించాలన్నా,అన్యాయాన్ని ఆపాలన్నా,ఉదయం లేవగానే వార్త చుదువుతున్నావ్ కారణం జర్నలిస్టు (విలేకర్లు).
చాలా మంది స్నేహితులుంటారు,మనల్ని ఉపయోగించుకునే వాళ్ళుంటారు.కానీ ఒక్కరూ సహాయం చేసేవారు ఉండరు వెన్నుపోట్లు, కుటిల రాజకీయాలు అదనం.వందల మందితో కలిసి పనిచేస్తున్నా ఎప్పుడూ ఒంటరితనం చిరాకు పెడుతూ ఉంటుంది.సమయానికి ఆకలి వేయదు.ఆకలి వేస్తే తినడానికి సమయం ఉండదు.నిత్యం నీతో నువ్వు సంఘర్షణ పడుతూనే ఉండాలి. అర్ధరాత్రి దాటినా నిద్దుర ఊసే ఉండదు కంటికి.ఖాళీగానే కాలం గడిచిపోతున్నట్టు ఉంటుంది కానీ క్షణం తీరికుండదు మనసుకు.రోజూ కనిపించని శతృవుతో యుద్దం చేస్తూండాలి.ఇవన్నీ తట్టుకుని నిలబడే వాడికి ఎంతో ఓపికుండాలి !ఎంత సహనముండాలి !ఎంత గుండె ధైర్యముండాలి !ఇక్కడ బ్రతకాలంటే భయపడకు భయపడే వాడివైతే ఇక్కడికి రాకు అన్నింటిని తట్టుకొని నిలబడితే,నీకు ఎదురు వచ్చే వాడే ఉండడు.వచ్చినా,నీ మేధాశక్తితో నువ్వు ఎక్కడికో వెళ్లొచ్చు,ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు.ఎవడూ నేను జర్నలిస్టు అవుతానని అనుకోడు.తరగతి గదిలో టీచర్ అడిగినప్పుడు ఏ డాక్టరో ఏ ఇంజినీరో అవుతాను అని మనలో చాలా మంది చెప్పి ఉంటాం.కానీ మనకు వేరే ఛాయిస్ లేకనో ఛాయిస్ రాకనో వృత్తిలో ఆకర్షణతోనో ఈ వృత్తి లోకి వచ్చాము కాబట్టి ఇక్కడే ఉండాలి ఇక్కడే పోరాడాలి.జర్నలిస్టులను గౌరవిధం,ఆదుకుందాం,అండగా నిలబడదాం.