కనుమరుగైన పండుగ సంబరాలు
బిఎచ్డి ప్రతి నిధి : పాఠకులకు భోగి శుభాకాంక్షలు తెయజేస్తు నేటి తరంలో... సంక్రాంతి వస్తుందంటే చాలు నాలుగురోజుల ముందు నుంచే గంగిరెద్దుల నాట్యాలు,హరిదాసుల సంకీర్తనలు,ఇళ్ల ముంగిట రంగవల్లులు,వాటి మధ్య గొబ్బెమ్మలు వెరసి పల్లెల్లో సంబురం వెల్లివిరుస్తుండేది.వేర్వేరు ప్రాంతాల్లోని బంధువులందరూ ఒక్క చోటకు చేరి ఆనందంగా గడిపేవారు.కానీ మారుతున్న కాలంలో సంస్కృతి,సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి.నేటి తరం పిల్లలు గంగిరెద్దులు,హరిదాసులు అంటే ఏమిటీ? అని అడిగే పరిస్థితి ఏర్పడింది.నేడు పల్లెల్లో గంగిరెద్దులు కనిపించడం లేదు.హరిదాసుల సంకీర్తనలు వినిపించడం లేదు.ఎక్కువ మంది కులవృత్తులను మానుకోవడంతో పల్లెల్లో కనిపించాల్సిన సంబురం దూరమవుతోంది.ఇళ్ల ముందు రంగవళ్లులు సైతం మొక్కుబడిగానే సాగుతున్నాయి.ఇళ్లలో తయారు చేసే పిండి వంటల స్థానంలో రెడీమేడ్ వంటలు చోటు చేసుకుంటున్నాయి.మూడు రోజులు పండుగలో మొదటి రోజు భోగి,రెండో రోజు సంక్రాంతి,మూడో రోజు కనుమ.భోగి రోజు మంటలు వేస్తారు నవధాన్యాలు,రేగిపండ్లతో స్నానాలు చేస్తారు.కనుమ రోజున పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు.
అదనంగా 30 లడ్డు విక్రయ కేంద్రాలు
తిరుమల : తిరుమలలో ప్రసుత్తమున్న లడ్డు విక్రయ కేంద్రాలను మరిన్నీ పెంచుతున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం 50 లడ్డు విక్రయ కేంద్రాలు నిరంతరం పనిచేస్తుండగా భక్తులు లడ్డుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడకుండా వీటికి అదనంగా మరో 30 పెంచనున్నట్లు తెలిపారు.శుక్రవారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోనున్నామని వివరించారు.తిరుచనూర్ ఆలయంలో సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారని బెంగళూరుకు చెందిన భక్తుడు ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు.భక్తులు,యాత్రికులతో ప్రవర్తనపై ఆలయ సిబ్బందికి తగు శిక్షణ అందజేస్తామని తెలిపారు.తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించి భవనాల అద్దెను పెంచలేదని మరోసారి స్పష్టం చేశారు. అవాస్తవాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.సామాన్య భక్తులకు సులభంగా దర్శనం కలిగించేలా మరిన్నీ చర్యలు తీసుకోవాలని ఈవోకు భక్తులు సూచించారు.