Type Here to Get Search Results !

Sports Ad

కలెక్టర్ అనుదీప్ గారికి శుభాకాంక్షలు తెలిపి డాక్టర్ మద్దెల శివకుమార్ బృందం Dr.Maddela Sivakumar congratulated the team collector Anudeep

 

కలెక్టర్ అనుదీప్ గారికి శుభాకాంక్షలు తెలిపి ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ బృందం

కొత్తగూడెం :  నూతన కలెక్టరేట్ భవన సముదాయాల్లోనికి ప్రవేశించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ గారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ బృందం!ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి గౌ.శ్రీ కెసిఆర్ గారు స్వయంగా ప్రారంభించిన KSM వద్దగల నూతన కలెక్టరేట్ భవనాల సముదాయం లోనికి విధి నిర్వహణలో ప్రవేశించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌll శ్రీ దురిశెట్టి అనుదీప్ గారిని అభ్యుదయ కళాసేవ సమితి జిల్లా అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్  తన మిత్ర బృందంతో కలిసి గురువారం నాడు సాయంత్రం కలెక్టర్ గారికి పూల బొకేలు అందించి  శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ అంకితభావం కృషి దీక్షా దక్షితలు మరియు కఠోర పరిశ్రమతో శ్రీ అనుదీప్ గారు చిన్న వయసులోనే ఈ సమాజానికి ప్రజలకు విశిష్టమైన సేవలందించే ఉన్నతమైన హోదా కలిగిన కలెక్టర్ గా రావడం అందులో IAS టాపర్ గా నిలవడం మన జిల్లా వాసుల అదృష్టమని అట్టడుగున ఉన్న ప్రాంతాలలోని ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ మారుమూల ప్రాంత ప్రజలకు కూడా తమ నిరంతర కృషితో సేవలందిస్తూ  అటు అధికారులను ఇటు ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ  అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ  విశిష్టమైన సేవలందిస్తున్న  శ్రీ అనుదీప్ గారు ఎంతైనా అభినందనీయులని వారికి విధి నిర్వహణలో కావలసిన శక్తి సామర్థ్యాలను ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆ దేవాది దేవుడు కలగజేయాలని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆకాంక్షించారు.

అన్ని జిల్లా అధికారుల కార్యాలయాలన్నిటిని ఒకచోట నిర్మించి ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించిన ఈ నూతన కలెక్టరేట్ మరియు జిల్లా అధికారుల కార్యాలయాల భవనాల సముదాయం  ఒక అద్భుతమైన ప్రక్రియగా ఆచార్య డాక్టర్ మద్దెల అభివర్ణించారు ఈ భవన సముదాయం త్వరితగతిన పూర్తి కావడానికి విశేష కృషి జరిపిన శ్రీ అనుదీప్ గారిని వారి సిబ్బందిని ఆచార్య డాక్టర్ మధ్యలో శివకుమార్ ఈ సందర్భంగా అభినందించారు.ఈ అభినందన కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల వెంట  దైవజనులు పాస్టర్ ఆశీర్వాదం పాస్టర్ సూరిబాబు క్రీస్తు సువార్తికులు కే దాసి పీటర్ బాబు సంఘ ప్రధాన కార్యదర్శి అపరబాలు అల్లి శంకర్  సంఘ గౌరవ అధ్యక్షులు సినీ నటులు తాండూర్ ధనరాజ్  సంఘ జిల్లా ఆర్గనైజర్  స్టీవెన్ లాజరస్  నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies