ఎమ్మెల్యే పైలెట్ ని కలిసిన ఎక్మయి గ్రామ యువకులు
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం ఎక్మయి గ్రామ యువకులు ఎస్సీ కమ్యునిటీ హాలు కోసం మరియు గ్రామంలో మంచి నీటి సమస్య గురించి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యై పైలెట్ రోహిత్ రెడ్డి గారు త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.నీటి సమస్యను వెంటనే ఎంపిడిఓ గారికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించారు.అనంతరం సంతోషం కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమాలలో బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు విజయ్ కుమార్,కాశీనాథ్,మోహన్,శ్రీకాంత్,వీరేశం,సంజీవ్,నగేష్,జగదీష్,శాంత్ కుమార్,రమేష్,శానప్ప,శాంత్ తదితరులు పాల్కొన్నారు.
నిరుపేదలకు వరం సిఎంఅర్ఎఫ్
- 3 లక్షల రూపాయల చెక్కు
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన జగదీశ్వర్ కు 3 లక్షల రూపాయల చెక్కు ని ముఖ్యమంత్రి సహాయనిది నుండి అందజేయడం జరిగింది. సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని,ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులగా ఆదుకుంటుందని,ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమాలలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు పటేల్,పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి గ్రామస్థులు తదితరులు పాల్కొన్నారు.