వికారాబాద్ లో ఈతకు వెళ్లి నలుగురు మృతి
విహార యాత్రలో విషాదం
కోట్‌పల్లి ప్రాజెక్టులో పడి నలుగురు గల్లంతు
అందులో ముగ్గురి మృతి,మరొకరి కోసం వెతుకులాట
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కుటుంబంతో సరదాగా విహార యాత్ర కోసం వచ్చిన ఓ కుటుంబంలో విషాధం నెలకొంది.వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి ప్రాజెక్టులో నలుగురు గల్లంతుకాగా అందులో ముగ్గురు మృతి చెందారు.మరొకరికోసం వెతుకులాట జరుగుతోంది సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది.వివరాల ప్రకారం మన్నెగూడ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబ సభ్యులు కేశవ్(28) మరియు జగదీష్(24),రాజేష్(24),వెంకటేష్(25) ఈ నలుగురు జిల్లాలోని కోట్‌పల్లి ప్రాజెక్టు వద్దకు విహార యాత్ర కోసం వచ్చారు.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కోటిపల్లి ప్రాజెక్టులో పడి గల్లంతు అయ్యారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.గల్లంతు అయిన నలుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి.మరోకరికి కోసం గాలింపు చేస్తున్నారు.సరదా కోసం వచ్చిన విహార యాత్రలో నలుగురు మృత్యువాత వల్ల ఆ కుటుంబంలో విషాధం నెలకొంది.నలుగురి యువకుల మృతదేహాలను కోటిపల్లి నుండి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.ఈ మేరకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.మరోవైపు జరిగిన ప్రమాదంపై వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్,జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆరా తీస్తున్నారు.
కోట్ పల్లి ఘటనపై మంత్రి సబితా రెడ్డి,రంజిత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
కోట్ పల్లి చెరువు దగ్గర జరిగిన సంఘటన పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.వికారాబాద్ జిల్లా మన్నెగూడ ప్రాంతానికి చెందిన వారి విహార యాత్ర విషాదంగా మారటం ఎంతో బాధ కలిగించిందని వారి కుటుంభ సబ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.సంఘటన విషయం తెలిసిన వెంటనే వారి ఆచూకీ కోసం గాలించాలని,పోలీసులకు అదేశించిట్లు తెలిపారు.నాలుగు మృతదేహాలు లభించాయని,వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ దుర్ఘటనలో మృతి చెందడం అత్యంత బాధాకరమని మంత్రి పేర్కొన్నారు.సంఘటనపై వికారాబాద్,పరిగి ఎమ్మెల్యే తో పాటు కలెక్టర్,ఎస్పిలతో మంత్రి మాట్లాడారు.ఎంపీ రంజిత్ రెడ్డి కోట్ పల్లి ప్రాజెక్టు లో జరిగిన సంఘటన చాలా బాధాకరం అన్నారు.ఘటన స్థలానికి చేరుకొని అరా తీశారు.