ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
- హైద్రాబాద్ తార్నాకలో విషాదం
- ముగ్గురిని చంపి తాను ఆత్మహత్య
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని తార్నాకలో సోమవారం నాడు విషాదం చోటు చేసుకొంది.తార్నాక ప్రాంతం ప్రజలలో భయాందోళగా ఉన్నారు.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.ఈ నలుగురు ఆత్మహత్య చేసుకున్నారని తొలుత భావించారు.కానీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి.హైద్రాబాద్ తార్నాకలోని ఓ అపార్ట్ మెంట్ లో సింధూర ఆమె నాలుగేళ్ల కూతురు.ఆమె అత్త రాజరి నివాసం ఉంటున్నారు.సింధూర హిమయత్ నగర్ లో బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నారు.సింధూర భర్త ప్రతాప్ చెనైలోని కార్ల షోరూమ్ లో పనిచేస్తున్నాడు.వీరికి వివాహమై ఎనిమిదేళ్లు అవుతుంది. చెన్నైకి షిఫ్ట్ కావాలని ప్రతాప్ తన భార్య సింధూరపై ఒత్తిడి తీసుకువస్తున్నాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.కానీ ప్రతాప్ నే హైద్రాబాద్ కు వచ్చి ఉద్యోగం చేయాలని సింధూర కోరుతుంది.ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారని సమాచారం.సంక్రాంతి సెలవులను పురస్కరించుకొని ప్రతాప్ హైద్రాబాద్ కు వచ్చారు.చెన్నైకి మకాం మార్చే విషయంలో నిన్న రాత్రి గొడవ జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.తన నాలుగేళ్ల కూతురు ఆధ్య,భార్య సింధూర,తల్లి రాజరిని చంపిన తర్వాత ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.ప్రతాప్ మాత్రమే ఉరేసుకొన్నాడని పోలీసులు చెబుతున్నారు.మిగిలిన ముగ్గురిని చంపిన తర్వాత ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.హైద్రాబాద్ కు షిప్ట్ అయ్యే విషయమై భార్యాభర్తల మధ్య గొడవలున్నాయని సింధూర తల్లి చెబుతున్నారు.ప్రతాప్, సింధూరల మధ్య బంధుత్వం ఉంది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.