డబ్బు డిమాండ్...జిమ్ కోచ్
- జిమ్‌లో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం
- డబ్బు డిమాండ్ చేసిన నిర్వాహకుడు
- ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు
హైదరాబాద్ Hyderabad : హైదరాబాద్ లో బోయిన్‌పల్లిలో జిమ్‌లో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు డబ్బు డిమాండ్ చేసిన నిర్వాహకుడిని ట్రైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఓ యువతి ఇంటర్ చదువుతోంది. జిమ్‌కు వచ్చిన ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లుగా నటిస్తూ ఆమె వర్కవుట్ చేస్తుండగా జిమ్ నిర్వాకుడు రాజు యాదవ్ (30),కోచ్ రవి యాదవ్ (25) ఫొటోలు తీశారు.వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి డబ్బులు ఇవ్వాలని,లేకుంటే ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.దీంతో భయపడిన యువతి ఇంట్లో చెప్పకుండా అప్పుడప్పుడు మొత్తంగా 20 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు లక్షల నగదు వారికి ఇచ్చింది.అయినా వారు వేధింపులు ఆపకపోవడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది.వారు గురువారం రాత్రి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు రవి యాదవ్,రాజు యాదవ్‌లను అరెస్టు చేసి విచారణ మొదలు పెట్టారు విచారణలో వారి సెల్‌ఫోన్లో మరికొన్ని మార్ఫింగ్ ఫొటోలు ఉన్నట్లు గుర్తించి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.కోర్టు అనుమతితో నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.వారిని కఠినంగా శిక్షించాలని బాధిత యువతి కుటుంబసభ్యులు జిమ్ వద్ద ఆందోళన నిర్వహించారు.