చావాలా ? బ్రతకాలా ? జిప్సం ఫ్యాక్టరీ వెంటనే మూసివేయాలి
- అన్నదాతలకు పంటలు నాశనమవుతున్నాయి
- జిప్సం ఫ్యాక్టరీ ముందు ఆందోళన
- మూతపడేంత వరకు ఆందోళన నిర్వహిసస్తాం
- గ్రామస్తులు,రైతులు యువకులు
- గుంత బాస్పల్లి,మిట్ట బాస్పల్లి,కరణ్ కోట్ గ్రామలు
తాండూరు : జిప్సం ఫ్యాక్టరీ వెంటనే మూసివేయాలని మిట్టబాస్పల్లి,గుంత బాస్పల్లి గ్రామస్థులు ధర్నా చేశారు.తాండూర్ మండలం మిట్టబాస్పల్లి,గుంత బాస్పల్లి గ్రామ సమీపంలో నెలకొల్పిన ఇండస్ కెమ్ లిమిటెడ్ కంపెనీ ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కరణ్ కోట్ రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబరు 143 లో మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో ఈ కంపెనీ ఏర్పాటుతో చుట్టుపక్కల వ్యవసాయ పొలాలని బీడు భూములుగా మారిపోయాయి.బోరు బావుల ద్వారా వచ్చే నీళ్ళలో దుర్వాసనతో పాటు నీటిలో నూనె లాంటి పదార్థాలు తేలుతూ కనిపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు.త్రాగడానికి మంచినీళ్లు వాడదామన్న వచ్చే నీళ్లలో విషపూరితమైన కెమికల్స్ వ్యర్థాలు కలిసిపోయి దుర్వాసన వస్తుందని చెబుతున్నారు.
మిట్టబాస్పల్లి,గుంత బాస్పల్లి గ్రామస్థులు ధర్నా
ఈ నీళ్లతో స్నానం చేసుకున్న ప్రజలకు సైతం చర్మవ్యాధులు వస్తున్నాయని తెలిపారు.బాసుపల్లి గ్రామస్తులు,రైతులు ఫ్యాక్టరీ ముందు ఆందోళన వ్యక్తం చేశారు.పారిశ్రామిక వాడలలో విడుదలయ్యే విషపూరితమైన పదార్థాలను హైదరాబాదు నుంచి భారీ ట్రక్కులలో తీసుక వచ్చిన నిర్వహుకులు ఇక్కడ ముడి పదార్థాన్ని తయారుచేసి పెద్ద పెద్ద సిమెంట్ కంపెనీలలో యంత్రాలను రన్ చేయడం కోసం బొగ్గుగా మండించే స్థానంలో ఈ పదార్థాన్ని వాడతారని అక్కడి నిర్వాహకులు తెలిపారు.అలాగే 140 సర్వే నంబర్ లోని సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ఏమాత్రం గుర్తింపు లేని కంపెనీ పేరుతో జిప్సం తయారీని అక్రమంగా కొనసాగిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.రాజకీయ ప్రోద్బలంతో కొనసాగిస్తున్న ఈ జిప్సం కంపెనీ ద్వారా దుర్వాసనతో పాటు భూగర్భ జలాలు కలుషితమైపోతున్నాయని వాపోతున్నారు.
జిప్సం ఫ్యాక్టరీ లోపలి భాగం,కెమికల్ పదార్థాలు
జిప్సం కంపెనీలు మూసివేసే వరకు ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు.పదే పదే గుర్తుకొస్తున్నా అధికారులు,నాయకులు పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.మండల ఎస్ఐ మరియు పోలీసులు సిబ్బంది వచ్చి సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని తెలిపారు.ఈ ధర్నాలో మిట్టబాస్పల్లి,గుంత బాస్పల్లి గ్రామస్థులు,సర్పంచు జగదీష్,ఉప సర్పంచులు,రైతులు యువకులు తదితరులు పాల్కొన్నారు.