Type Here to Get Search Results !

Sports Ad

వేదికపైనే సూర్య హీరోయిన్ చేయి పట్టుకుని లాగి Heroine Surya

 

వేదికపైనే సూర్య హీరోయిన్ చేయి పట్టుకుని లాగి 

- సూర్య హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించిన స్టూడెంట్

సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రం విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది.IMDB లో అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా రికార్డు సృష్టించింది.క్రిటిక్స్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.అంతే కాదు ఈ చిత్రంతో సూర్య ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు.సుధా కొంగరా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ మూవీలో సూర్యకి జోడిగా బొద్దుగుమ్మ అపర్ణ బాలమురళి నటించింది. ఆమె నటనకి కూడా ప్రశంసలు దక్కాయి,మధ్యతరగతి మహిళగా ఈ చిత్రంలో ఆమె బాగా సెట్ ఐంది. 

ప్రస్తుతం అపర్ణ బాలమురళి 'తన్కమ్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు.ప్రమోషన్స్ లో భాగంగా తన్కమ్ మూవీ టీం కేరళలోని ఓ కాలేజీలో పర్యటించారు.అక్కడ జరిగిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ప్రినీష్ ప్రభాకరన్, హీరో వినీత్ శ్రీనివాసన్ తో పాటు అపర్ణ కూడా పాల్గొంది.అయితే ఓ విద్యార్థి వేదికపై ఉన్న అపర్ణతో అసభ్యంగా ప్రవర్తించాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వేదికపైకి అనూహ్యంగా వచ్చిన ఓ విద్యార్ధి అపర్ణ చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేశాడు. ఫోటో కావాలని బలవంతం చేశాడు. ఇబ్బందిగా ఫీల్ అవుతూనే అపర్ణ అతడితో ఫోటో దిగేందుకు అంగీకరించింది.

ఆ స్టూడెంట్ అంతటితో ఆగకుండా అపర్ణ భుజంపై చేయి వేస్తూ మితిమీరి ప్రవర్తించాడు.దీనితో అపర్ణ అతడి నుంచి తప్పించుకుని అసహనం వ్యక్తం చేసింది.కంట్రోల్ కోల్పోకుండానే ఆ విద్యార్థి నుంచి తప్పించుకుని తిరిగి వెళ్లి కూర్చుంది.దీనితో సదరు విద్యార్థి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆ విద్యార్థి సారీ చెప్పి వెళ్ళిపోయాడు.ఈ సంఘటన జరుగుతున్నప్పుడు చిత్ర యూనిట్ మొత్తం వేదికపైనే కూర్చుని ఉన్నారు.కానీ ఒక్కరు కూడా ఆ యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీనిపట్ల కూడా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies