Type Here to Get Search Results !

Sports Ad

అధిక రక్తపోటు గుర్తించటం ఎలా,హైపర్ టెన్షన్ కి కారణాలు High blood pressure,how to identify the causes of high blood pressure

 

 అధిక రక్తపోటు గుర్తించటం ఎలా,హైపర్ టెన్షన్ కి కారణాలు

* ఈ మధ్య కాలంలో హైపర్‌టెన్షన్‌ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.చాలా మందికీ ప్రారంభంలో తమకు హైపర్‌టెన్షన్‌ ఉందనే భావన కూడా ఉండడం లేదు.తీవ్ర స్థాయికీ చేరుకుంటే కానీ వైద్యుడి వద్దకు పరుగులు తీయడం లేదు.తలనొప్పి,జ్వరం,దగ్గు శరీరపు నొప్పులతో వచ్చే వారికి పరీక్షలు చేస్తే హైపర్‌ టెన్షన్‌ బయట పడుతుందని,అప్పటి వరకు వారికి తమకు ఫలాన ఇబ్బంది ఉందనే భావన వారికి తెలియడం లేదని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు.నూటికి 80 శాతం మందికీ హైవర్‌టెన్షన్ ఉందని తెలియడం లేదంటున్నారు.ముఖ్యంగా మధుమేహం,పక్షవాతం మరియు కిడ్నీ ఫెయిల్యూర్,థైరాయిడ్,ఆర్థో సమస్యలు ఉన్నవారు హైపర్‌టెన్షన్‌తో ఎక్కువగా బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.

* హైపర్‌టెన్షన్‌ ఏ వయసులో వస్తుంది ?

కొందరు ఏ కారణం లేకుండానే హైపర్‌టెన్షన్‌ బారిప వడుతున్నారు.దీని బారిన పడిన వారికీ చాల మందికి కారణాలే తెలియడం లేదు. కొందరిలో రెండు పదులు దాటితే వంశపారం పర్యంగా హైపర్‌టెన్షన్‌ వచ్చే అవకాశముంది.కొందరికి 18 ఏళ్ల వయస్సులోనే హైపర్‌టెన్షన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు.పరీక్షలు వేస్తే గానీ బీపీ ఉందనేది నిర్దారణ కాదు.యువతలో ఈ నమన్య ఎక్కువగా కనిపిస్తోంది.20 నుంచి 30 ఏళ్ల వయస్సు వారిలో 5 శాతం 30 నుంచి 40ఏళ్ల వారిలో 10 శాతం,40 నుంచి 50 ఏళ్ల వయస్సు వారిలో 5 శాతం, 50 నుంచి 60 ఏళ్ల వారిలో 15 శాతం మంది హైపెర్టెన్షన్ తో ఇబ్బంది పడుతున్నారు.ప్రతి ముగ్గురు బాధితుల్లో ఒక యువతికి ఉండవచ్చని వ్యాధులు పరిగణిస్తున్నారు.

* హైపర్ టెన్షన్ కి కారణాలు

ఉదయం ఇంటి నుంచి బయలుదేరితే ఏ ఆర్థరాత్రికే వస్తున్నారు.దీంతో భోజనం చేయాలనే ఆలోచనే ఉండడం లేదు.ఎక్కడ పడితే ఆక్కడ,ఏదీ పడితే అది తినేస్తున్నారు.ఇందులో ఉప్పు ఉన్న ఆహార పదార్ధాలే ఎక్కువ ఉంటున్నాయి.ప్రాసేస్‌ ఫుడ్‌,పీజ్జాలు,బర్గర్‌లు, రెడీమేడ్‌ మాంసం,కూల్‌డ్రింక్‌లు,ప్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారు.ఇటువంటి వాటిలో 20 శాతం ఉప్పు ఎక్కువగా ఉంటుంది.ఆల్కాహాల్‌ 1.2 ఎంఎల్‌కు మించితే బీపీ పెరిగే అవకాశాలూ ఉన్నాయి.దాదాపు 15 శాతం ట్రాఫిక్‌ టెన్షన్‌తో జనం హైవర్‌టెన్షన్‌కు గురువుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు.ట్రాఫిక్‌లో ఎక్కువగా తిరిగే వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌ ఫీల్డ్‌,మెడికల్‌ రిప్రజెంటేటివ్స్,సేల్స్‌మెన్‌,డైవర్సు ఇలా తదితర వర్గాల్లో హైవర్‌టెన్షన్‌కు గురవుతున్నఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies