పోలీసులకు కొట్టే హక్కు ఎక్కడిది ? మాజీ కలెక్టర్ ఆకునూరి మురళీ
భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం స్థానిక ఎస్సై పై ఆయన పని చేసే పోలీస్ స్టేషన్‌లోనే ఫిర్యాదు నమోదైంది.భూపాలపల్లి జిల్లా మాజీ కలెక్టర్ ఆకునూరి మురళీ దగ్గరుండి మరీ ఫిర్యాదు చేయించారు.ఫిర్యాదులో వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలో కూనారపు భిక్షపతి అనే యువకుడు రాంగ్‌రూట్లో ద్విచక్రవాహనాన్ని నడుపుతుండగా స్థానిక ఎస్సై రామకృష్ణ అతన్ని ఆపి లాఠీతో కొట్టారు.అటుగా వెళ్తున్న మాజీ కలెక్టర్ ఆకునూరి మురళీ తన వాహనాన్ని ఆపి మీకు కొట్టే హక్కు ఎక్కడిదని ఎస్సైను ప్రశ్నించారు. ఆ యువకుడికి సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.యువకుడికి సారీ చెప్పి ఎస్సై వెళ్లిపోయారు. అనంతరం అక్కడి నుంచి యువకుడితో నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సైపై ఆకునూరి మురళీ ఫిర్యాదు చేయించారు.