Type Here to Get Search Results !

Sports Ad

రెజ్లింగ్ లను లైంగికంగా వేధించడం దారుణం in Delhi

 

రెజ్లింగ్ లను లైంగికంగా వేధించడం దారుణం 

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లు వినేశ్ ఫొగాట్,సాక్షి మాలిక్,బజరంగ్ పూనియాలకు న్యాయం చేయాలని మహబూబాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు జాతీయ సీనియర్ ఖోఖో అథ్లెటిక్ క్రీడాకారుడు‌ కోచ్ బొడ్డుపల్లి ఉపేంద్రం మాట్లాడుతూ రోజు రోజుకు మహిళలపై వివిధ రకాలుగా దాడులు జరగడం భాధాకరం ఆటలలో మహిళలు ముందుకు రావడమే కష్టమైన రోజులలో ఆటలలో తర్ఫీదు ఇవ్వాల్సిన తండ్రి లాంటి కోచ్ ఆ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించడం దారుణమని ఇలాంటి సంఘటనలు జరగడం వలన క్రీడాస్ఫూర్తి దెబ్బ తింటుందని రాబోయే రోజుల్లో ఏ మహిళా కూడా క్రీడలు ఆడేందుకు ముందుకు రారని కేంద్ర ప్రభుత్వం క్రీడా మంత్రిత్వ శాఖ వెంటనే విచారణ చేయించి మహిళా రెజ్లర్లకు న్యాయం చేయాలని తప్పు జరిగినట్టు తేలితే భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ ను మరెవరు అలా చేయకుండా కఠినంగా శిక్షించాలని కోరారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies