Type Here to Get Search Results !

Sports Ad

అర్ధరాత్రి వరకూ ట్రాఫిక్‌ పోలీసుల విధులు In Hyderabad

 

అర్ధరాత్రి వరకూ ట్రాఫిక్‌ పోలీసుల విధులు

* సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చలానాలు
* ట్యాంక్ బండ్ అంబేడ్కర్‌ విగ్రహం
* ట్రాఫిక్‌ పరిస్థితులు పరిశీలిస్తున్న అదనపు సీపీ సుధీర్‌బాబు

హైదరాబాద్ : హైదరాబాద్ లో రాత్రి వేళలోనూ ట్రాఫిక్‌ పోలీసులు విధులు నిర్వహించనున్నారు.నగరంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం ట్రాఫిక్‌ రద్దీ లేని రాత్రి,ఉదయం సమయాల్లోనే నమోదవుతున్నాయి. ఈ దూకుడుకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో నగర ట్రాఫిక్‌ పోలీసులు కొత్త పద్ధతి అనుసరించనున్నారు.కొన్ని ప్రాంతాల్లో ప్రయోగించి అక్కడి ఫలితాలను విశ్లేషిస్తారు. నిపై నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ జి.సుధీర్‌బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.డీసీపీ, ఏసీపీ,ఇన్‌స్పెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

ఇప్పటివరకూ ట్రాఫిక్‌ పోలీసులు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే విధుల్లో ఉంటున్నారు.ఇకపై నగరంలోని 35 ప్రధాన కూడళ్లలో రాత్రి 8-12 గంటలు,ఉదయం 6-8 గంటల వరకూ విధులు నిర్వర్తించనున్నారు.రాత్రి 8-12 గంటల వరకు విధుల్లో ఉన్న సిబ్బంది అర్ధరాత్రి 12 తర్వాత సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో విశ్రాంతి తీసుకుంటారు.తిరిగి ఉదయం 6-8 గంటల వరకూ అదే కూడలిలో విధులు చేపడతారు.తర్వాత రోజువారీ విధులకు వచ్చే సిబ్బంది రాగానే వీరంతా ఇళ్లకు చేరతారు. మొదటగా ఈ విధానాన్ని పంజాగుట్ట, సోమాజిగూడ, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు,కేబీఆర్‌పార్క్‌,ఏఎన్‌ఆర్‌సర్కిల్‌,బేగంపేట తదితర ప్రధాన కూడళ్లలో అమలు చేయనున్నట్టు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు.మరోవైపు రద్దీలేని సమయాల్లోనూ నిబంధనలు పాటించని వాహనాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి చలానాలు పంపనున్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies