నూతన కలెక్టరేట్ ప్రారంభం రిబ్బెన్ కట్ చేస్తున్న కెసిఆర్
- వనమా కోరిక మేరకు కొత్తగూడెంకు సీఎం కేసీఆర్ వరాలు
- వనమాపై ప్రశంసలు కురిపించిన సీఎం కేసీఆర్
- ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కోరికల చిట్టా ఇస్తారని వెల్లడి
- పాల్వంచ కొత్తగూడెం మున్సిపాలిటీలకు 80 కోట్లు
- ముర్రాడు వాగు ప్రక్షాళనకు స్మితా సబర్వాల్ కు ఆదేశాల
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తప్పకుండా ఇస్తామని ప్రకటన
కొత్తగూడెం : కొత్తగూడెంకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే వనమా కోరిక మేరకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించేందుకు కొత్తగూడెం వచ్చిన సీఎం ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కొత్తగూడెంకు చెందిన వనమా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కోరికల చిట్టాతో వస్తారని ప్రజల కోసం ఏదో చేయాలనే తపన పడతారని అందుకోసం ఆయన అభినందిస్తున్నానని అన్నారు ఆయన కోరిక మేరకు ముర్రేడు వాగు ప్రక్షాళనకు వెంటనే పరిశీలన జరిపి దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని తన స్పెషల్ సెక్రటరీ స్మిత సబర్వాల్ ను ఆదేశిస్తున్నట్లు తెలిపారు.విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.కొత్తగూడెంలో గురువారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్
సీఎం మాట్లాడుతూ కొత్తగూడెం జిల్లాకు చాలా వచ్చాయని,ఇంకా చాలా వస్తాయని తెలిపారు.ఐక్య పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు.8 ఏళ్ల కిందటి తెలంగాణకు,ఇప్పటి తెలంగాణకు పోలికే లేదన్నారు.ఆనాడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.87 వేలు ఉంటే ఉప్పుడు తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు ఉందని కేసీఆర్ తెలిపారు. ఆనాడు జీఎస్‌డీపీ రూ. 5లక్షల కోట్లు ఇప్పుడు మన జీఎస్‌డీపీ రూ.11.5 లక్షల కోట్లని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ పథకాన్ని పూర్తి మానవీయ కోణంలో అమలు చేస్తున్నామన్నారు కేంద్ర అసమర్థ, దుర్మార్గ విధానాల వల్ల తెలంగాణ రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని ఆరోపించారు.
సీఎం గారితో పలు సమస్యల పై మాట్లాడుతూన్నా ఎమ్మెల్యే వనమా
అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు చేశారు.హెలికాప్టర్ ద్వారా మహబూబాబాద్ నుంచి కొత్తగూడెంకు వచ్చిన కేసీఆర్ జిల్లా నేతలు,అధికారులు ఘన స్వాగతం పలికారు.కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకోగా పోలీసుల నుంచి గౌరవ వందనం సమర్పించారు.ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు.అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.చాంబర్‌లో కలెక్టర్ అనుదీప్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
సభకు తరలి వచ్చిన ప్రజలు నాయకులు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పాల్వంచ పట్టణంలో జరిపిన పర్యటనలో సీఎంకు ఘన స్వాగతం పలికి, విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలకు DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం పాల్వంచలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి విచ్చేసిన కెసిఆర్ కు కొత్తగూడెం ఎంఎల్ఏ వనమా వెంకటేశ్వరరావు నాయకత్వంలో ప్రజా ప్రతినిధులు,మహిళలు,అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా స్వాగతం పలికారన్నారు. వనమా నేతృత్వంలో కొత్తగూడెం నియోజకవర్గానికి సీఎం ఆర్థిక నిధులు మంజూరు చేసి, వనమాపై అభినందన ల వర్షం కురిపించినందుకు కొత్వాల కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో TRS పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు SVRK ఆచార్యులు,ZPTC సభ్యులు బరపటి వాసుదేవరావు,MPP మడివి సరస్వతి,వైస్ ఎంపీపీ మార్గం గురవయ్య,పెద్దమ్మ తల్లి గుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం,సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్,TRS మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి,పూసల విశ్వనాథం,పెద్దమ్మగుడి మాజీ సభ్యులు బేతంశెట్టి విజయ్, చింత నాగరాజు,నవభారత్ ఆనంద్ లు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం లోని ఎక్మాయ్ గ్రామం లో ప్రజలు వివేకానంద స్వామి జయంతి గత 10ఇయర్స్ నుండి జరుపుకోవడం లేదు. ఇలా అయితే చదువు కునే పిల్లలకు వివేకానంద నంద తెలియ ని పరిస్థితి వస్తుంది ప్రతి పండుగ ను జరుపుకోవాలని అధికారులు చూడాలి లేకపోతే భూమి మీద గొప్ప వాళ్ళ జీవితం తెలీకుండా పోతుంది
ReplyDelete