Type Here to Get Search Results !

Sports Ad

బేతనియ సంఘస్తులైన నూతన వధూవరులు ఆశీర్వదించారు In Kothagudem

 

బేతనియ సంఘస్తులైన నూతన వధూవరులు ఆశీర్వదించారు

కొత్తగూడెం : బేతనియ సంఘస్తులైన నూతన వధూవరులు బ్రదర్ జాషువా మరియు సిస్టర్ ప్రిస్సిల్లలను తన బృందంతో దర్శించి నూతన వస్త్రాలను బహుకరించి ఆశీర్వదించిన ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్.బేతనియ ప్రార్ధన మందిరము వ్యవస్థాపకులలో ఒకరు మరియు బేతనియ సంఘానికి రోల్ మోడలైన సీనియర్ పెద్దలు బ్రదర్ జి జే ఆర్ గిల్బర్ట్ గారి పెద్ద కుమార్తె అయిన ఆనీలిడియా మరియు లేట్ డేనియల్ స్వర్ణ గార్ల కుమారుడైన బ్రదర్ జాషువా డానియల్ మరియు సిస్టర్ ప్రిసిల్లా టో పో  దైవ చిత్తానుసారముగా ఇటీవల నూతన వధూవరులుగా జతపరచ బడిన సందర్భంగా నూతన వధూవరులను స్థానిక హౌసింగ్ బోర్డ్ లో గల వారి స్వగృహమందు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మరియు క్రీస్తు సువార్తికులు బ్రదర్ కేదాసి పీటర్ బాబులు తమ బృందంతో దర్శించి నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ నూతన వధూవరులకు మరియు అక్క అనీలిడియాకు నూతన వస్త్రాలను బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ మాట్లాడుతూ వివాహము అన్ని విషయములలో ఘనమైనదని భార్యాభర్తలుగా జతపరచబడిన జాషువా మరియు ప్రీ స్సిల్లలు ఒకరినొకరు దేవునితో అంటకట్టబడి ఏకమనసుతో సహనము సంయమనంతో ప్రేమతో  ఓరిమితో  క్రయముతో త్యాగముతో పెళ్లి వాగ్దానాలు చేసిన విధంగా కలిమి లోను లేమి లోను వ్యాధిలోను బాధలోనూ  సుఖములోనూ దుఃఖములోను ఇరువురు సమాన భాగస్వామ్యాన్ని వహించి ఆదర్శ దంపతులుగా జీవించాలని ఆకాంక్షించారు.

క్రీస్తు సువార్తికుడు సహోదరుడు పీటర్ బాబు  ఆ దేవాది దేవుని నిండైన మెండైన ఆశీర్వాదములు  వీరి గృహంలోనూ ఈ నూతన జంటపై సదా కుమ్మరించాలని ప్రార్థన చేసి ఆశీర్వదించారు.ఈ ఆత్మీయ సందర్శనలో అభ్యుదయ కళా సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ క్రీస్తు సువార్తికులు బ్రదర్ కేదాసి పీటర్ బాబు నూతన వధూవరులు బ్రదర్ జాషువా సిస్టర్ ప్రిసిల్లా అక్క ఆనీలిడియాలతో పాటు బ్రదర్ సాలమన్ అపరబాలు అల్లిశంకర్ జిల్లా ఆర్గనైజర్ స్టీవెన్ లాజరస్ యూత్ నాయకులు మద్దెల ఆదర్శ్  నిఖిల్ నికోలస్ లెంటిల్ నరేందర్ లతోపాటు కుటుంబ సభ్యులు బ్రదర్ బోడికల డేవిడ్ అక్క కుసుమకుమారి సిస్టర్లు ఎల్సి రేచల్  జీవ సుందరి జోయల్ ఫెయిత్ పుష్ప  బ్రదర్ సామ్యల్ బ్రదర్ పూర్ణ బ్రదర్ మిల్కీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies