భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్..కార్యకర్తల సమావేశం ఏర్పాటు..!
- భారతీయ సర్వ సమాజ్ మహాసంఘ్ అధ్వర్యంలో
- చండ్రుగొండ లో ముఖ్య కార్యకర్తల సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం లక్ష్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో భారతీయ సర్వ సమాజ్ మహసంఘ్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి 30 మండలాలు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా BSSM తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు గారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఫిబ్రవరి నెల 5వ తేదీ నుండి అన్ని మండల కేంద్రాల్లో ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు కట్టించే ప్రభుత్వం జాప్యం చేస్తుందని, 2005 కంటే ముందు నుండి సాగులో ఉన్నారో వారికి పోడు పట్టాలు మంజూరు చేయాలని.
గిరిజన పూజారుల విషయంలో 2019 నుండి నెలసరి వేతనాలు మంజూరు చేయాలని పోరాడుతున్న జాప్యం చేస్తున్నారని పలు అంశాల మీద ఫిబ్రవరి 5 నుండి పెద్ద ఎత్తున శాంతియుత ఉద్యమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా నాయకురాలు కొప్పుల నాగమణి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరిడేపల్లి రవి, ఖమ్మం జిల్లా అధ్యక్షులు పలగాని శ్రీనివాసరావు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వర్శ వెంకన్న,రాష్ట్ర కమిటీ,జిల్లా కమిటీ,మండల అధ్యక్షులు,మండల కార్యదర్శులు,తదితరులు పాల్గొన్నారు.