Type Here to Get Search Results !

Sports Ad

భారత రాజ్యాంగంలో లౌకికత్వం సమానత్వం In Kothagudem

 

భారత రాజ్యాంగంలో లౌకికత్వం సమానత్వం

- అంబేద్కర్ బానిసత్వపు చెర నుండి విడిపించి మహానుబాహుడు 
- ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ శ్రీ బండి రమేష్
- ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్
- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో


భద్రాద్రి కొత్తగూడెం : భారతదేశ అభివృద్ధికి సమైక్యతకు దశ దిశ నిర్దేశకత్వాన్ని సూచించే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి.బ్రిటిష్ వారి పరదాస్య శృంఖలాల నుండి  బానిసత్వపు చెర నుండి మనల్ని విడిపించి మన దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించిన త్యాగ ధనులు గాంధీ,నెహ్రూ,బాబాసాహెబ్ అంబేద్కర్,లోకమాన్య బాలగంగాధర్ తిలక్,సర్దార్ వల్లభాయ్ పటేల్,అల్లూరి సీతారామరాజు,భగత్ సింగ్,ఆజాద్ చంద్రశేఖర్,నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తూ తన అపరిమిత మేధస్సుతో భారత రాజ్యాంగాన్ని రాసి విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు విభిన్న సాంప్రదాయాలు గల భారతదేశాన్ని సమైక్యంగా ఏకతాటిపై నడిచే విధంగా అందరూ కలిసి శాంతి సౌభ్రాతృత్వాలతో సహజీవనం చేసే విధంగా మన దేశ అభివృద్ధికి సమైక్యతకు దశా దిశా నిర్దేశకత్వాన్ని సూచించే భారత రాజ్యాంగాన్ని నేడు మనమంతా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయునిపై ఉందని  నిమ్మల గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.


74 వ రిపబ్లిక్ డే సందర్భంగా పాఠశాలలో ఘనంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో గౌరవ అతిథిగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందన సమర్పణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు తొలుత గాంధీ అంబేద్కర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు విద్యార్థులను గ్రామస్తులను ఉద్దేశించి ఆచార్య డాక్టర్ మద్దెల ప్రసంగించారు.1956 జనవరి 26న మన దేశం సర్వ స్వతంత్ర గణతంత్ర దేశంగా అమలులోకి వచ్చిందని బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో లౌకికత్వం సమానత్వం
స్వేచ్ఛ సౌబ్రాతృత్వం లాంటి అంశాలను పొందుపరిచి సమ సమాజం ఏర్పాడాలని ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లను కల్పించి సమన్యాయం పాటించారని కానీ కొందరు రాజ్యాం గే తర శక్తులు
భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యపరచాలని చూస్తున్నారని అట్టివారిపట్ల అప్రమత్తంగా ఉండి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.




సివిల్ సర్వీసెస్ కు సిద్ధపడుతున్న పాఠశాల పూర్వ విద్యార్థి వంశీకృష్ణ మాట్లాడుతూ ఈ పాఠశాల నుండి చదివి నేను ఉన్నత స్థానానికి వచ్చానని బాబా సాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే మన దేశ అభివృద్ధికి మూలమని అంబేద్కర్ గారు సెలవిచ్చిన పే బ్యాక్ టు ద సొసైటీ అనే నినాదాన్ని కట్టుబడి నేను మన గ్రామానికి మరియు పాఠశాలకు తప్పకుండా చేయూతనందిస్తానని ప్రకటించారు.ఈ సందర్భంగా ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఆలపించిన అభ్యుదయ గీతాలు అందరినీ అలరించాయి.అనంతరం రిపబ్లిక్ డే సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.చివరిగా అందరికీ స్వీట్లు బిస్కెట్లు చాక్లెట్లు పండ్లు పంపిణీ చేశారు.

ఘనంగా జరిగిన ఈ రిపబ్లిక్ డే వేడుకలలో  గ్రామ సర్పంచ్ శ్రీ బండి రమేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ లతోపాటు పంచాయతీ సెక్రటరీ శ్రీ ఇజ్జహద్  వార్డు సభ్యులు శ్రీమతి చిట్టెమ్మ శ్రీమతి వెంకటరమణ సహఉపాధ్యాయులు ఎండి షఫీ అహ్మద్ పాఠశాల విద్యా కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి టి రజిత వైస్ చైర్మన్ శ్రీ బండి రమేష్ సివిల్ సర్వీసెస్ కు సిద్ధపడుతున్న వంశీకృష్ణ అంగన్వాడి టీచర్ ప్రమీల ఆశ వర్కర్ సరోజినీ  గ్రామ పెద్దలు బడుగు నాగేశ్వరరావు రాఘవులు బండి వెంకన్న ఉష లావణ్య పుల్లమ్మ యూత్ సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies