బాల కార్మికులకు చదువు యొక్క ప్రాధాన్యత చూపాలి
- జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి
- వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్.రియాజ్
- నిరక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతాలల్లో
నంద్యాల (Nandhyala) : నంద్యాల పట్టణంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి,యువజన సంఘం కాలమనిని ఆవిష్కరించిన నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి గారు,నంద్యాల జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి Chintha Mani.స్థానిక నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లా ఎస్పీ ఆఫీస్ నందు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి కర్నూల్ జిల్లా ఎస్సీ,ఎస్టీ,విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు మమతారెడ్డి బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి,యువజన సంఘం కాలమనిని ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి,యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి రామచంద్రుడు.
వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్.రియాజ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరల నుంచి విద్యార్థి,యువజన ప్రజా సమస్యల పరిష్కరం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సంస్థ బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ విద్యార్థి,యువజన సంఘం అని బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని గత 15 సంవత్సరల నుంచి నిరక్షరాస్యత తక్కువ ఉన్న ప్రాంతాలల్లో జీపు జాత చేసి బాల కార్మికులకు చదువు యొక్క ప్రాధాన్యత తెలిపి బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలని అనేక ఉద్యమాలు చేయడం జరిగిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా నాయకులు,విజయ్,నంద్యాల జిల్లా నాయకులు పవన్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.