Type Here to Get Search Results !

Sports Ad

జాతీయగీతం అలకిస్తూ మువ్వన్నెల జెండా ఆవిష్కరణలు in Tandur MLA Pilot Rohith Reddy

 

ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 

- జాతీయగీతం అలకిస్తూ మువ్వన్నెల జెండా ఆవిష్కరణలు
- ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 
- వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు

తాండూర్ : ఈ రోజు 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యలయం,మున్సిపల్ ఆఫీస్,గాంధీ చౌక్,ప్రభుత్వ జూనియర్ కలెజ్ గ్రౌండ్,పాత తాండూరు అంబేద్కర్ పార్కు,సాయి పూర్ 9వ వార్డ్ అంగన్వాడీ,గంగోత్రి పాఠశాల,రాజీవ్ కాలనీ,శౌకార్ పెట్,ఇందిరానగర్ పాత తాండూరు బస్తి దవాఖాన) తదితర చోట్ల నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి,మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పాల్కొన్నారు.ఈ సందర్బంగా ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరియు వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ భారత రాజ్యాంగాని నిర్మించిన మహానేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వలన ఈరోజు దేశంలో అన్ని రంగంలో ముందుకు సాగుతుంది అంటే ఆనాడు గొప్ప మహానుబాహులు చేసిన త్యాగాలు అని మరిచిపోవద్దు.ప్రతి విద్యార్థి దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు.ఎంతోమంది స్వాతంత్ర యోధుల త్యాగ ఫలం.నేటి మన భారతదేశం నిజానికి మనకు 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వచ్చినప్పటికీ 1950 జనవరి 26 తో సంపూర్ణ స్వాతంత్య్రం లభించిందని దానినే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆమే గుర్తు చేశారు.


చూడ చక్కని కళ బృందం విద్యార్థులు 

రాజ్యాంగ రచన కార్యాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు దేశ ప్రజల సర్వతోముకాభివృద్ధికి తోడ్పడే లిఖిత రాజ్యాంగాన్ని అందించి అందులో హక్కులు ,విధులు పొందుపరచడం జరిగిందని అని తెలిపారు.మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి వచ్చిందని అలా 1950,జనవరి 26న రాజ్యాంగం నిర్మించబడి పూర్తి గణతంత్ర దినోత్సవంగా భారత దేశం అయ్యిందని అన్నారు.భారతదేశ గణతంత్ర  కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ,వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధపార్టీల నాయకులు,ప్రజాప్రతినిధులు,యువకులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.


PDSU ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక 

తాండూర్ పట్టణంలో ఎమ్యెల్యే రోహిత్ రెడ్డి చేసే అభివృద్ధి పనులు చూసి బీఆర్ఎస్‌‌లోకి చేరానన్న దీపక్ రెడ్డి.ఈ రోజు తాండూర్  ఎమ్యెల్యే కార్యాలయంలో బీఆర్ఎస్‌లోకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా PDSU ఉపాధ్యక్షులు దీపక్ రెడ్డి ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో 30 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.బీఆర్ఎస్ కండువా కప్పుకున్న దీపక్ రెడ్డి అనుచరులు.అనంతరం జాయిన్ ఇన్ బిఆర్ఎస్వి  పోస్టర్ ఆవిష్కరణ చేసిన గౌరవ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిఆర్ఎస్వి అధ్యక్షులు జోగులాఎభినేజర్,నాయకులు విద్యార్థి విభాగం సభ్యులు,దీపక్ రెడ్డి,దీపక్ రెడ్డి అనుచరులు తదితరులు పాల్గొన్నారు.



కోటపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో

కోటపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా మహనీయులను తలుచుకొని వారి త్యాగాల ఫలితం తోటి దేశానికి స్వతంత్రం రావడం జరిగింది.గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారు భారతదేశానికి దిక్సూచిగా రాజ్యాంగాన్ని రచించి స్వతంత్రం యొక్క ఫలితాలు అందరికీ చెందాలని ఎంతో కృషి చేయడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మణ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు ప్రజలు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies