తాండూర్ లో గెలుపొందిన వాళ్లకు బహుమతులు
తాండూర్ : ఫాతిమా షేక్ జన్మదిన పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆమె యొక్క జన్మదిన సందర్భంగా వారం రోజులపాటు నిర్వహిస్తున్నరు.వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని ఉర్దూ మీడియం పాఠశాలల్లో ఆమె యొక్క జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది.అనంతరం గెలుపొందిన విద్యార్థులకు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అదేవిధంగా పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నయమప్పు గారి చేతులగా విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి మున్సిపల్ వైస్ చైర్మన్ దీప నర్సింహులు మాట్లాడుతూ ఫాతిమా షేక్ గారు ఉమెన్స్ మరియు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ఇంతగానో కృషి చేయడం జరిగిందని,అంతేకాకుండా ఆమె భారతదేశం యొక్క మొట్టమొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలుగా పనిచేయడం జరిగింది.ఆమెను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు అప్పు మాట్లాడుతూ ఫాతిమా షేక్ యొక్క జీవిత చరిత్రను విద్యార్థులు చదవాలని విద్యార్థుల దశ నుంచే ఆమె యొక్క జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని అదేవిధంగా ఆమె పుట్టినరోజు దినాన్ని అధికారికంగా జరపాలని దీని కోసం ఈ విషయాన్ని తాండూర్ గౌరవ పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు.
అనంతరం విద్యార్థి విభాగం ఇంచార్జ్ జిలాని మాట్లాడుతూ ఫాతిమా షేక్ యొక్క జీవిత చరిత్ర ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమె యొక్క జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.మహిళా విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే తో కలిసి ఫాతిమా షేక్ కుల రహిత సమాజం కోసం కూడా కృషి చేయడం జరిగిందని మహిళా విద్యకు కృషి చేస్తున్న సందర్భంలో ఆమెకు అనేక బెదిరింపులు అవమానాలు కూడా ఎదురు కావడం జరిగిందని అయినా ఆమె భయపడకుండా ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఫెరోస్ ఖాన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యక్షులు మజార్ యువ నాయకులు డేవిడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇట్లు జిలాని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తాండూర్ డివిజన్ ఇంచార్జ్ (న్యాయవాది) పాల్గొన్నారు.