బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు
- విద్యాశాఖ మాత్యులు గౌరవ శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి
- చేవెళ్ల ఎంపీ గౌరవ గడ్డం రంజిత్ రెడ్డి
- నూతనంగా 2.5 కోట్లతో నిర్మించిన KGBV
వికారాబాద్ : మంగళవారం రోజున విద్యాశాఖ మాత్యులు గౌరవ శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి Sabitha Indra Reddy,జడ్పీ చైర్ పర్సన్ గౌరవ శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి Sunitha Mahendhar Reddy,చేవెళ్ల ఎంపీ గౌరవ గడ్డం రంజిత్ రెడ్డి Ranjith Reddy మరియు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ Methuku Anand మోమిన్ పేట్ మండల పరిధిలోని చాంద్రయన్ పల్లి గ్రామ సమీపంలో నూతనంగా 2.5 కోట్లతో నిర్మించిన KGBV ఇంటర్మీడియట్ విద్యాలయం భవనాన్ని ప్రారంభించారు.
విద్యార్థులతో కూర్చున్న మంత్రులు
మంత్రులు మాట్లాడుతూ KGBV విద్యాలయాల్లో ప్రాథమిక విద్యతో పాటు ఇంటర్మీడియట్ విద్యను కూడా అందిస్తూ పేద మధ్యతరగతి ఆడబిడ్డల బంగారు భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు.విద్యార్థులతో కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మీరు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, డీఈఓ రేణుక దేవి,ప్రజాప్రతినిధులు,అధికారులు పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి కార్యకర్త కార్యనిర్వాహనతో కలసికట్టుగా పనిచేయాలి
నాడు విద్యాశాఖ మాత్యులు గౌరవ శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి,చేవెళ్ల ఎంపీ గౌరవ గడ్డం రంజిత్ రెడ్డి మరియు వికారాబాద్ జిల్లా,భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల BRS పార్టీ ముఖ్య ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.BRS పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త పార్టీ నిర్ణయాలకు కట్టుబడి,గౌరవ ఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారి పై గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పై BRS పార్టీ పై అభిమానంతో పనిచేయాలన్నారు.యువతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి 100 మందికి ఒక ఇన్చార్జిని నియమిస్తూ పార్టీని మరింత పటిష్టంగా నిర్మాణం చేయాలన్నారు.మండలాల మాదిరిగానే ప్రతి గ్రామానికి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకోని ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ర్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.