యువత ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలలో రాణించాలి
- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ : శనివారం నాడు వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్,కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ గౌలికర్ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అధికారాలు మాట్లాడుతూ యువత ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో రాణించాలని,నిరుద్యోగులు వారి నైపుణ్యం రిత్యా ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
యువత దేశానికి ఎంతో ఆదర్శంగా ఉండాలని కోరారు.ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆశయాల కోసం వెనుకడుకు చూడ కుండా ముందుకు సాగాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.
BRS పార్టీ ఒక మంచి నాయకుణ్ణి కోల్పోయింది
ధారూర్ మండలం కుక్కింద గ్రామ సర్పంచ్ మరియు ధారూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు కారంజ్ వీరేశం గారు నిన్న రాత్రి ప్రమాదవశాత్తు బైక్ పై నుండి పడి మరణించడంతో ఈ రోజు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వీరేశం గారి అంతిమ యాత్రలో పాల్గొని,భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అందరిని కలుపుకుంటూ పోతు సలహాలు,సూచనలు ఇచ్చే మంచి వ్యక్తిని కోల్పోయామని వారి మృతి,పార్టీకి తీరని లోటుగా మిగిలిందన్నారు.వారి కుటుంబానికి మనో ధైర్యాన్ని చెప్పి అన్నివిధాలుగా తోడుంటామన్నారు.