భారత్ జోడో యాత్రకు...ఒక కారణం ఉంది..!
- మీడియా కేవలం ప్రధాని మోదీ,బాలీవుడ్ నటులు,క్రికెటర్లను
- సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలయింది
- భారత్ జోడో యాత్ర ఎందుకు చేపట్టానంటే
ఢిల్లీ Delhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగింపు దశకు చేరుకుంది.గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర జనవరి 30న కశ్మీర్‌లో ముగియనుంది.మొత్తం 12 రాష్ట్రాల్లో పూర్తిచేసుకోనున్న ఈ యాత్రకు విశేష స్పందన వస్తోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో మాట్లాడిన రాహుల్ గాంధీ అసలు ఎందుకు ఈ యాత్ర చేపట్టాల్సి వచ్చిందనే విషయాన్ని వెల్లడించారు.పార్లమెంటులో ఎప్పుడు మాట్లాడాలని అనుకున్నా మా మైకులు కట్ చేస్తారు.
కెమెరాలు స్పీకర్ వైపు తిప్పుతారు నోట్ల రద్దు, జీఎస్టీ, అగ్నివీర్ ఇలా ఏ విషయంపై మాట్లాడినా అదే తీరు.నిరుద్యోగం,అగ్నిపథ్ వ్యవసాయ చట్టాలు వంటి కీలక అంశాలను మీడియా ప్రస్తావిస్తుందా మీడియా కేవలం ప్రధాని మోదీ,బాలీవుడ్ నటులు,క్రికెటర్లను మాత్రమే చూపిస్తుంది.ప్రభుత్వం నుంచి న్యాయవ్యవస్థ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.సీబీఐ,ఈడీలపైనా ఒత్తిడి పెరుగుతోంది.ఈ క్రమంలోనే ధరల పెరుగుదల,నిరుద్యోగం వంటి అంశాలను లేవనెత్తాలని నేను భావించా అందుకే భారత్ జోడో యాత్రను చేపట్టా.కన్యాకుమారిలో 125 మందితో మొదలైన ఈ యాత్రలో లక్షలు,కోట్ల మంది నాతో పాటు నడిచారు అని తెలిపారు.