తిరుగులేని పార్టీ బీఆర్ఎస్
- ఆంధ్రలో భారీ ఫ్లెక్సీలతో స్వాగతం
- భారీ మెజారిటీతో గెల్వనున్న బీఆర్ఎస్
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్,మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో చేరారు.ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు జరుగుతాయని సీఎం కేసీఆర్ చెప్పారు.ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తారని వెల్లడించారు.త్వరలో భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని తెలిపారు.సిట్టింగులు కూడా తనకు కాల్ చేసి పార్టీలో చేరుతామని చెబుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు అనంతపురం టీజే ప్రకాశ్,కాపునాడు,జాతీయ అధ్యక్షుడు తాడివాక రమేశ్ నాయుడు,ప్రధాన కార్యదర్శి గిద్దల శ్రీనివాస్ నాయుడు,ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు రామారావు కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,మల్లారెడ్డి,గంగుల కమలాకర్,ప్రభుత్వ విప్ బాల్క సుమన్,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.