కంటి వెలుగు పథకం ప్రతి ఇంటికి వెలుగు
- ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
- కలెక్టర్ నిఖిల
-ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
తాండూర్ : తాండూర్ పట్టణంలో తాండూర్ టౌన్ 14వ వార్డ్ బస్తీ దవాఖానలో కంటి వెలుగు రెండో దశ కలెక్టర్ నిఖిలతో కలసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు మరియు పలు గ్రామాలలో బషీరాబాద్,కోట్ పల్లి,పెద్దేముల్ మండలలో ప్రారంభం చేశారు.ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం.ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరియు కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకమైన రెండవ విడత కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టారని,ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం ప్రతి ఇంటికి వెలుగు.తెలంగాణలో ప్రవేశపెట్టే పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయట్లేదని,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని కంటి చూపు పరీక్ష చేయించుకోవాలని కోరడం జరిగింది.అవసరమైన వారికి అద్దాలు ఇవ్వడం మరియు మెరుగైన చికిత్స కోసం ఉన్నతమైన ఆసుపత్రికి పంపించి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది అని అన్నారు.కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కంటి చూపును మెరుగుపరుచుకోవాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల,జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్,అధికారులు,బిఆర్ఎస్ పార్టీ పెద్దలు మరియు నాయకులు అభిమానులు అలాగే యువజన విభాగం సభ్యులు,మహిళా విభాగం, సభ్యులు,బిఅరెస్ కార్మిక విభాగం,రోహిత్ అన్న యువ సైన్యం సభ్యులు,మరియు కార్యకర్తలు ప్రజా నిధులు తదితరులు పాల్కొన్నారు.