కేసీఆర్ పార్క్... సూపర్ సారు
- చెన్నూరులో ప్రకృతి అందాల విందు
- హరితవన ప్రేమికుడు ఎమ్మెల్యే బాల్క సుమన్
- చెన్నూరు పట్టణంలో పూర్తయిన కేసీఆర్ పార్క్
- అందమైన ప్రకృతి,సుమనన్న అద్భుత ఆలోచనకు ఆకృతి
- రెండు కోట్లతో పట్టణ నడిబొడ్డున నవ్య కళాకృతి
చెన్నూరు : చెన్నూరు పట్టణంలో అందంగా ముస్తాబైన కెసిఆర్ పార్క్ “చెన్న” అంటే అందమైన అని అర్థం.చెన్నూర్ అంటే అందమైన ఊరు.మహిమాన్విత గోదావరి తీరాన,పచ్చని హరితవనం మధ్యలో వెలసిన చెన్నూరు పట్టణం దశాబ్దాల రాజకీయ దాహానికి బలైపోయింది.నాలుగు శతాబ్దాలుగా అగస్త్యుడు వెలిగించిన అఖండ జ్యోతి నిర్విరామంగా వెలుగుతున్నాదశాబ్దాలుగా గత పాలకుల రక్కసుల నీడలో చెన్నూరు పట్టణం మసకబారింది.
కానీ ప్రభుత్వ విప్ మరియు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం చెన్నూర్ పట్టణ రూపురేఖలే మారిపోయాయి.100 కోట్ల పై చిలుకు నిధులతో పట్టణ ప్రాశస్త్యానికి తిరిగి జీవం పోస్తున్నారు.అందులో భాగంగా ప్రజలకు ప్రకృతికి మధ్య సామరస్య సంబంధం ఉండాలనే లక్ష్యంతో పట్టణం నడిబొడ్డున ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేలా రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన కేసీఆర్ పార్క్ ప్రారంభానికి సిద్ధమైంది.
చెన్నూరు,కేసీఆర్ పార్కు విశేషాలు ఎన్నో ఎన్నెన్నో పచ్చని తివాచీ పరిచినట్లు కనిపించే గడ్డి ఒకవైపు,జీవం ఉట్టిపడేలా కనిపించే జంతువుల బొమ్మలు మరోవైపు.చిన్నపిల్లల కోసం క్రీడా ప్రాంగణం,గిలిగింతలు పెట్టే మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్,వ్యక్తి పరిపూర్ణత్వాన్ని పొందడానికి సహకరించే యోగ సెంటర్,గజిబో,మెట్రో నగరాల్లో కనిపించే అద్భుత శిల్పకళా వైభవం.చుట్టూ మిరమిట్లు గొలిపే ప్రకాశవంతమైన లైట్లు,రక్షణ కోసం సీసీ కెమెరాలు,ఇలా ఒకటా రెండా రెండు ఎకరాల్లో నిర్మించిన కేసీఆర్ పార్కులో ప్రకృతి పులకించే అందాలెన్నో చూస్తేనే పరవశించే మనసులెన్నెన్నో ఇంత అందమైన పార్కు మరి కొద్ది రోజుల్లోనే ప్రజలను కనువిందు చేయనుంది.రంగురంగుల ఇంద్రధనస్సు వలె చెన్నూరు గడ్డ వికసించాలి.ఈ నేలపై బాల్క సుమన్ పేరు శాశ్వతంగా నిలిచిపోవాలి.