Type Here to Get Search Results !

Sports Ad

బీజేపీని తరిమి కొట్టేదాం...బీఆర్ఎస్ ని గెలిపిదం Let's throw BJP out BRS has won


బీజేపీని తరిమి కొట్టేదాం... బీఆర్ఎస్ ని గెలిపిదం 

- సంస్కరణల పేరుతో ప్రజలను మోసం బీజేపీ 
-  బీజేపీ పాలసీ ప్రైవేటైజేషన్,బీఆర్ఎస్ పాలసీ నేషనలైజేషన్
- సకల జనుల సంక్షేమం మా లక్ష్యం
- కుల-మత వివక్ష లేని భారతదేశం నిర్మిద్దాం

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో నిర్వహించిన భారత్ రాష్ట్రసమితి భారీ బహిరంగ సభ నిండు జనంతో విజయవంతమైంది.ముగ్గురు ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రివాల్,భగవంత్సింగ్ మాన్,యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్,సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా సభకు హాజరైన అశేష జనవాహినికి సందేశాలిచ్చారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తూ దేశాన్ని తెగనమ్ముతున్నదని ఆరోపిస్తూ వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ప్రజాసంక్షేమం కోసం ఆలోచించే ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ప్రపంచంలోనే భారత దేశాన్ని ప్రథమ స్థానంలో నిలుపవచ్చని తెలిపారు.ఈ అశేష ప్రజానీకం ఇచ్చిన ప్రోత్సాహం,ఉత్తేజంతో తాము తమ రాష్ట్రాలకు పోయి కేంద్రంలో ప్రజానుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామని ప్రకటించారు.



అప్ కీ బార్ కిసాన్ కి సర్కార్  సీఎం కేసీఆర్ 

ఖమ్మం భారతదేశం తన లక్ష్యాలని కోల్పోయిందా? బిత్తరపోయిందా?ఎవరినీ అడుక్కోవాల్సిన అవసరం లేనంత అన్నిరకాల సంపద ఉంది మన దగ్గర? మరి ఎందుకు ఇంత దౌర్భాగ్యం?41 కోట్ల ఎకరాల సాగు భూమి,70 వేల టీఎంసిల జలరాశి,ఏటి పొడుగునా సూర్యరశ్మి, విశాల తీరప్రాంతం,మూడు విభిన్న వాతావరణ జోన్లు, యాపిల్ నుంచి మామిడి వరకు విభిన్న పంటలు,కష్టించి పనిచేసే జాతిరత్నాలలాంటి కోట్లాది మానవ సంపద ఎందుకు మరి దరిద్రం?ప్రపంచస్థాయి బెస్ట్ ఫుడ్ చైన్ గా ఉండాల్సిన మనం కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకోవడం విచారకరం కాదా? పామాయిల్ మనమే ఉత్పత్తి చేసుకోలేమా? 75 సంవత్సరాల తర్వాత కూడా దేశప్రజలకు రక్షిత మంచినీరు ఇవ్వలేమా? ఎవరి పాపం ఇది?ఇవన్నీ సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్.ఈ దుర్మార్గానికి కారణభూతులు దొందూ దొందే – కాంగ్రెస్,బీజేపీ.

మన గొంతులు,పొలాలు తడువాల్నా,ఎండాల్నా దేశంలో 4,10,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండీ  2,10,000 మించి వాడడంలేదు పంచాయితీలు పెట్టి ఉత్పాదక లేకుండా చేస్తున్నారు. ఉచితాల పేరుతో రైతులు, పెదలనూ అవమానిస్తున్నారు.14 లక్షల కోట్లు తమ మిత్రులైన పెట్టుబడిదారులకు దోచి పెట్టినరు.భారతదేశం అంతా 24 గంటలు కరెంటు ఇచ్చినా లక్ష కోట్లకు మించి ఖర్చు కాదు దీనికి మాత్రం మనసు రాదు మోడీకి.తెలంగాణ రైతుబంధు, 4 గంటల కరెంటు దేశమంతా ఇవ్వడం బీఆర్ఎస్ విధానం.Socialise the losses, privatise the profit అనేది కేంద్ర విధానం అని విజయన్ గారు అన్నరు. గేమ్ ఇది వాస్తవం.అయ్యా మోడీ గారూ మీ పాలసీ ప్రైవేటైజేషన్,మా పాలసీ నేషనలైజేషన్ మీరు ఎల్ఐసిని అమ్ముతారు.మేము 2024లో అధికారంలోకి వస్తాం ఎల్ఐసిని జాతి పరం చేస్తాం 42 లక్షల కోట్ల విలువైన ఎల్ఐసిని నిలబెడుతాం.ఎల్ఐసి ఉద్యోగులు,ఏజెంట్లు, పాలసీదారులు అందరూ మాకు తోడు ఉండండి కాపాడుకుందాం విశాఖ ఉక్కును కూడా కాపాడుకుంటాం.విద్యుత్ సంస్కరణల పేరుతొ ప్రైవేట్ చేయడం మేము ఆమోదించం విద్యుత్ కార్మికులు అందరినీ కోరుతున్నాం, కలిసి పోరాడుదాం.విద్యుత్ రంగాన్ని ప్రభుత్వ సెక్టార్ లోనే అద్భుతంగా పనిచేసేలా చేద్దాం.


Govt has every business to do business ప్రైవేట్ కు లాభసాటి వ్యాపారాలు అప్పగించే మీ ఆటలు సాగనివ్వం.భారత దళిత జాతికి మేము అండగా ఉంటాం సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు ఇచ్చి తీరుతాం.మహిళల అభ్యుదయం, గ వివక్ష నిర్మూలన సాధిస్తాం మహిళలకు చట్టసభలలో 35% రిజర్వేషన్లు ఇస్తాం.చైనా,జపాన్, సింగపూర్,మలేషియాలను తలదన్నే రీతిలో భారతదేశం ప్రగతిబాట పట్టాలని బీఆర్ఎస్ సంకల్పం.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అయిదు సవంత్సరాలలోపే దేశమంతా రక్షిత మంచినీరు ఇంటింటికీ ఇస్తాం.మేక్ ఇన్ ఇండియా నిజమైన స్ఫూర్తిలో సాధిస్తాం.యువతను పరిహాసం చేసే అగ్నివీర్ ను రద్దు చేస్తాం సర్వధర్మ సమభావన,సకల జనుల సంక్షేమం మా లక్ష్యం.కుల-మత వివక్ష లేని భారతదేశం నిర్మిద్దాం.బీఆర్ఎస్ కు మద్దతు పలకండి అంతిమ విజయం మనదే. 



బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం  యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌

ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ సభపై ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అశిలేశ్‌ యాదవ్‌ ప్రశంసలు కురిపించారు.ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ కృతజ్ఞతలు చెప్పారు.ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్న అఖిలేశ్‌ యాదవ్‌.ఇక్కడి కలెక్టరేట్లు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమన్నారు.బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం కావాలన్నారు.ప్రతిపక్ష నేతలను బీజేపీ బెదిరించే ప్రయత్నం చేస్తుందన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో అఖిలేష్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు.ఈ సభకు వచ్చిన జనమే దేశానికి ఒక సంకేతం. ఖమ్మం సభ చరిత్రలో నిలిచిపోతుంది.చారిత్రాక ఖమ్మం నగరం జనసంద్రంగా మారింది. ఖమ్మం ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు.కేంద్రం ఢిల్లీలో కూర్చొని ఒక్కో రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలని చూస్తోంది.బీజేపీని తరిమికొట్టే పోరాటం ఈ నేల నుంచే ప్రారంభం కావాలి.ఇంత పెద్ద సభను గతంలో నేనేప్పుడు చూడలేదు. 


సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నం  సీఎం పినరయి


కేంద్రం వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నిస్తోంది.ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నం చేస్తుంది అని తెలిపారు.కేంద్రం వైఖరితో లౌకికత్వం ప్రమాదంలో పడుతోంది.సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం యత్నిస్తోంది. ప్రమాదంలో పడ్డ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి అని కేరళ సీఎం పినరయి విజయన్ పిలుపునిచ్చారు.ఖమ్మం జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పినరయి విజయన్ పాల్గొని ప్రసంగించారు.


సంస్కరణల పేరుతో ప్రజలను మోసం భగవంత్సింగ్ మాన్

తెలంగాణ సాయుధ పోరాటం భూసంస్కరణలకు కారణమైంది. కార్పొరేట్ శక్తులకే కేంద్రం ఊతమిస్తోంది.రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది.దేశాన్ని బీజేపీ,ఆర్ఎస్ఎస్ కలిసి పాలిస్తున్నాయి.న్యాయ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు.మాతృభాషను చంపే ప్రయత్నంలో భాగంగా హిందీని బలవంతంగా మన మీద రుద్దుతున్నారు.సంస్కరణల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు.

కంటి వెలుగు అద్భుతం అరవింద్ కేజ్రివాల్

దేశంలో విద్యా, వైద్యం బాగుంటేనే అభివృద్ధి జరుగుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ స్పష్టం చేశారు.ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో అరవింద్ కేజీవాల్ పాల్గొని ప్రసంగిస్తూ ఇవాళ రెండు బృహత్తర కార్యక్రమాల్లో పాల్గొన్నాను.కంటి వెలుగు కార్యక్రమం చాలా గొప్పది.పెద్దన్నలా ఎవరి కంటికి ఇబ్బంది వచ్చినా సీఎం కేసీఆర్ రెప్పలా కాపాడుకుంటున్నారు.కంటి వెలుగు అమలు తీరు అద్భుతం.పంజాబ్,ఢిల్లీలోనూ కూడా కంటి వెలుగు కార్యక్రమం మొదలు పెడుతాం.


ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పు సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా

బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది.విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోంది.దర్యాప్తు సంస్థలను చూపి భయపెట్టాలని చూస్తోంది.రైతులన్ని ఆదుకుంటామని మాట తప్పారు. విపక్ష నేతలపై కేసులు పెట్టి ఇరుకున పెట్టే యత్నం చేస్తోంది బీజేపీ.నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని,చేతులేత్తేశారు.మోదీ 400 రోజులే మిగిలి ఉన్నాయని అంటున్నారు.అంటే కేంద్రం రోజులు లెక్కబెట్టుకుంటుందని తెలిపారు.ఇవాల్టితో కేంద్రానికి కేవలం 399 రోజులు మాత్రమే ఉన్నాయి.తెలంగాణలో బీజేపీ ప్రక్షాళన జరుగుతున్నట్టే,యూపీలోను జరుగుతుందన్నారు.ప్రజాస్వామ్యానికి బీజేపీ ముప్పుగా మారింది.ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోదీ పాలన సాగుతోంది. బీఆర్ఎస్తో కలిసి పని చేస్తేనే దేశానికి కొత్త మార్గం దొరుకుతుంది.యాదాద్రిని అద్భుతంగా నిర్మించారు. కేసీఆర్
తక్కువగా మాట్లాడి,ఎక్కువగా పని చేస్తారు అని తెలిపారు.



కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ రోజున ఖమ్మంలో జరుగుతున్నటువంటి బిఆర్ఎస్ ఆవిర్భా ఉత్సవ మహోత్సవ భారీ బహిరంగ సభకు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు కొందరు బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు పాల్గొంటున్నారు. 








కెసిఆర్ గారి నాయకత్వంలో వనమా గారి పిలుపుమేరకు ఈరోజున పాల్వంచ నెహ్రు నగర్ నుండి బస్సుల ద్వారా జన సమీకరణ చేసి ఖమ్మం బహిరంగ సభకు బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్యెల్యేలు,ఎంపీలు,మంత్రులు,ఎంపిటిసిలు,సర్పంచులు,అధికారులు ప్రజలు తదితరులు పాల్కొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies