ఘనంగా మాయావతి జన్మదిన వేడుకలు
- తాండూర్ నియోజకవర్గం అధ్యక్షులు P. అరుణ్ రాజు
- బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల సురేష్
బషీరాబాద్ : బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి,ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ బెహన్ కుమారి మాయావతి గారి 67వ జన్మదిన వేడుకలను బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బషీరాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు.బహుజన నాయకులు మాట్లాడుతూ అక్షరాస్యత తక్కువ,పురుషాధిక్యం ఎక్కువ ఉన్న రాష్ట్రంలో బహుజన బ్రతుకులు మార్చాలని గడప దాటి నాలుగు సార్లు ముఖ్యమంత్రైన బెహెంజీ కుమారి మాయావతి Mayawati గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రధాన మంత్రిని చేసేదాకా బహుజనులం నిద్రపోమని హామీ ఇచ్చారు.
బషీరాబాద్ మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు
ఒక లక్ష నలబై ఐదు వేల మంది గుండాలను జైలులో పెట్టిన నాయకురాలు.సపాయి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన,ఉత్తర ప్రదేశ్ లో 23 జిల్లాలను ఏర్పాటు చేశారు. 23 జిల్లాలలో అన్ని హంగులతో హాస్పిటల్ లు నిర్మించరు.200 ఇంటర్ మీడియట్ కళాశాలలను,2 అంతర్జాతీయ విమానశ్రాయాలను దేశంలోనే అత్యంత నాన్యమైన నోయిడా ఎక్ష్ప్రెస్స్ వేని 572 జిల్లా పరిషత్ పాఠశాలలను నిర్మించారు.5549 ప్రభుత్వ ప్రైమరి పాఠశాలలను,2195 గ్రామాల్లో రోడ్ల నిర్మాణం 23 పోలీస్ లైన్ లను 28419 గ్రామాలను అంబేద్కర్ గ్రామ నిర్మన్ పథకం ద్వారా అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు.30 పాలిటెక్నీక్ కళాశాల లను నిర్మించిన గొప్ప నాయకురాలు బెహన్ కుమారి మాయావతి అని తెలిపారు.
తాండూర్ మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల సురేష్,బహుజన్ సమాజ్ పార్టీ మండల నాయకులు బాలకృష్ణ,పరశురాం,బహుజన్ సమాజ్ పార్టీ తాండూర్ అసెంబ్లీ BIT-CELLఇంచార్జ్ M.జయరాం,బహుజన సమాజ్ పార్టీ నాయకులు బసప్ప,శ్రీనివాస్,సురేష్,నరేష్,శ్యామ్,ఆనంద్,సంతోష్,యాలాల్ మండల అధ్యక్షుడు M.కృష్ణ,వికారాబాద్ జిల్లా ఈ.సీ మేంబర్ పడగళ్ల అంబ్రయ్య మరియు పెద్దముల్ మండల అధ్యక్షులు రమేష్,తాండూర్ నియోజకవర్గం అధ్యక్షులు P. అరుణ్ రాజు తదితరులు పాల్కొన్నారు.
యాలాల్ మండలంలో అధ్యక్షుడు M.కృష్ణ ఆధ్వర్యం