"కంటి వెలుగు" అవగాహన సదస్సులో మంత్రులు
- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు
రంగారెడ్డి : నేడు "కంటి వెలుగు" అవగాహన సదస్సు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కొంగర కలాన్ కలెక్టర్ అమోయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ కంటి వెలుగు అవగాహన సదస్సు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి,దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజలోకి మన ప్రభుత్వం అందిస్తున్న,సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం ప్రజాలోకి తెసుకోవాలని కోరారు.కంటి వెలుగు ప్రజలలో చైతన్యం తీసుకరావాలని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమాలలో విద్యా శాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీ సురభి వాణి దేవి,మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి,డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి,ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,ఎల్భినగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,చేవెళ్ల ఎమ్మెల్యే కలే యాదయ్య,శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అర్కేపుడి గాంధీ,కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్,తదితర అధికారులు పాల్గొన్నారు.
దానం మానవత ధర్మం సునీతారెడ్డి
హైదరాబాద్ : దానం చేయడం మానవత ధర్మంగా భావించి ప్రతిఒక్కరు అనాధాలకు దానధర్మం చేయాలని జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని హైదర్శకోట్లలో ఉన్న కస్తూర్భా గాంధీ ట్రస్ట్ లో అనాధాలకు స్థానిక కార్పొరేటర్ ఎస్.శ్రీనివాస్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సునితమ్మ చేతుల మీదుగా వంటలకు సంబంధించి ఆహారసామాగ్రి,దుస్తువులు,పండ్లు అందజేశారు.సమాజంలో ఉన్న విధివంచిత అభాగ్యులను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.