తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ని కలిసిన ఎమ్మెల్యే వనమా
హైదరాబాద్ : ఇటీవలే నూతనంగా నియమితులైన తెలంగాణ రాష్ట్ర డీజీపీ గా బాధ్యతలు చేపట్టిన అంజనీ కుమార్ గారిని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు గారు హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, శ్రీ నర్సింగ రావు (రిటైర్డ్ ఐఏఎస్) గారిని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు గారు హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించారు.తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ,న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారిని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో కలిశారు.ఈ సందర్భంగా పాల్వంచ లోని శ్రీనివాస గిరి పై ఉన్న దేవాలయానికి సంబంధించిన రోడ్ నిర్మాణానికి స్టేజ్ -1 క్లియరెన్స్ గురించి చర్చించి, సంబంధిత ఫైల్ ని రీజనల్ ఆఫీస్ కి ఫార్వర్డ్ చేయించారు.