Type Here to Get Search Results !

Sports Ad

జనం కోసంమే నా ఊపిరి MLA Vanama thanks to CM KCR

 

జనం కోసంమే నా ఊపిరి ఎమ్మెల్యే వనమా

- జనం కోసం వనమా - వనమా కోసం జనం
- అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నా
- ప్రజలే దేవుళ్ళు నేను పూజారిని మాత్రమే
- జంట నగరాలుగా తీర్చిదిద్దుతాం
- 100 కోట్లనిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు
- రెండో విడతలో 40 కోట్ల నిధులతో

భద్రాద్రి కొత్తగూడెం : ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధికి 100 కోట్లనిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.పాల్వంచ మున్సిపాలిటీకి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.100 కోట్లు మంజూరు.డిఎంఎస్టీ ఫండ్ కింద 60 కోట్లు,సీఎం గారి స్పెషల్ ఫండ్ కింద 40 కోట్ల రూపాయలు మంజూరు.60 కోట్ల రూపాయలు పనులు వెంటనే కలక్టర్ గారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఫిబ్రవరి 15 వ తేదీ కల్లా టెండర్లు పిలవడం జరుగుతుంది.పనులు చేజిక్కించుకున్న వారు బిల్లులు అయిన 5 రోజులకే చెల్లించడం జరుగుతుంది.ఈ 100 కోట్లతో పాల్వంచ పట్టణాన్ని కనీవినీ ఎరగని రీతిలో సుదరవందంగా తీర్చిదిద్దుతాం.ఈ 100 కోట్లతో పాల్వంచ పట్టణంలో రోడ్లు,డ్రైన్ లు,పార్కులు,లైటింగు,కమ్యూనిటీ హాల్స్ లాంటివి నిర్మిస్తాం.దశల వారీగా పనులు చేస్తాం.

ఈ 100 కోట్లతో ప్రజలకు కావలసిన మౌళిక సదుపాయాలు కల్పిస్తాం.ఈ 100 కోట్లతో పాల్వంచ పట్టణ రూపు రేఖలు మారుస్తాం.త్వరలోనే టెండర్లను పెట్టి పనులు ప్రారంభిస్తాం.అభివృద్ధిలో కొత్తగూడెం నియోజకవర్గం దూసుకువెళ్తున్నది హైదరాబాద్ - సికిందరాబాద్ ల లాగా కొత్తగూడెం - పాల్వంచ లను జంట నగరాలుగా తీర్చిదిద్దుతాం.కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం నియోజకవర్గం లో ఇప్పటికే 3 వేల కోట్లతో అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి.ప్రజలే దేవుళ్ళు - నేను పూజారిని మాత్రమే అక్కడ కేసిఆర్ ఇక్కడ నేను ప్రజల రుణం తీర్చుకుంటున్నాం.సూర్య చంద్రులు ఉన్నంతవరకు తన అభివృద్ధి కనపడాలన్నదే నా ధ్యేయం.ఈ గడ్డ మీద పుట్టిన నేను వార్డు మెంబర్ స్థాయి నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా,మున్సిపల్ ఛైర్మన్ గా, ఎంఎస్ఏగా,మంత్రి గా పని చేశా.నన్ను గెలిపించిన పాల్వంచ, కొత్తగూడెం నియోజక వర్గ ప్రజలకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.



ఐ మాస్ట్ లైటింగ్ నవభారత్ సెంటర్,పాత పాల్వంచ సెంటర్,దమ్మపేట సెంటర్,నటరాజ్ సెంటర్,అల్లూరి సెంటర్,బస్ స్టాండ్ సెంటర్,కోయాల వాటర్ ప్లాంట్ సెంటర్,ఇందిరా నగర్ కాలనీ సెంటర్,మెయిన్ రోడ్డు లైటింగ్ ,పాత పాల్వంచ నుండి బి.ఈడి కాలేజీ వరకు ఇందిరా నగర్ కాలనీ నుండి జయమ్మ కాలనీ వరకు,అల్లూరి సెంటర్ నుండి కరకవాగు వరకు,దమ్మపేట సెంటర్ నుండి శ్రీనివాస కాలనీ వరకు,బస్ స్టాండ్ సెంటర్ నుండి బజనమందిర్ వరకు,నటరాజ్ సెంటర్ నుండి మార్కెట్ ఏరియా వరకు,ప్రభుత్వ హాస్పిటల్ నుండి కె.ఎస్.పి.రోడ్డు వరకు,వార్డ్ ఆఫీసులు/ కమ్యూనిటీ హాల్లు గట్టాయిగూడెం కాలనీ,ఇందిరా నగర్ కాలనీ,పాల్వం,భారత్,శేఖరంబంజర్ బ్రిడ్జిలు కేసీఆర్ నగర్ బ్రిడ్జ్,నక్కల వాగు అయ్యప్ప నగర్ బ్రిడ్జ్,ప్రశాంత్ నగర్ కాలనీ - వెంగళ్ రావు నగర్ కాలనీ బ్రిడ్జ్,శ్రీనివాస నగర్ కాలనీ - బంజారా కాలనీ మినీ స్టేడియం పనులు,ఆర్&బీ గెస్ట్ హౌస్ స్థలము నందు టౌన్ హాల్ నిర్మాణము.

నా హయాంలోనే కొత్తగూడెం అనేక విధాలుగా అభివృద్ధి చెందింది.నా హయాంలోనే కొత్తగూడెం నియోజకవర్గంలో శాశ్వత కార్యక్రమాలు చేపట్టాను.పాల్వంచ,కొత్తగూడం పట్టణ ప్రజలకు కిన్నెరసాని నీళ్లను అందించింది నేనే,మళ్ళీ త్వరలో గోదావరి నీళ్లు అందించబోతున్నాం.అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నా 4 సార్లు ఎంఎల్పీ గా గెలిపించిన కొత్తగూడెం ప్రజల కోసం ప్రాణమిచ్చి పని చేస్తా.నేను టూరిస్ట్ ను కాను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడనే ప్రజలకు అండగా వుంటా.పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడమే నా ధ్యేయం.కేసిఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షం కేసిఆర్ – కేటిఆర్ సహకారంతో కొత్తగూడెం నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా.కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తూ, ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నా.ప్రజల ఆశీస్సులే కొండంత అండ జనం కోసం వనమా - వనమా కోసం జనం పని చేస్తా అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమాలలో డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస రావు,పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్,వర్కింగ్ అధ్యక్షులు ఎస్విఆర్కి ఆచార్యులు,సొసైటి వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్,మండల బిఆర్ఎస్ అధ్యక్షులు మల్లెల శ్రీ రామమూర్తి,బిఆర్ఎస్ నాయకులు కాల్వ ప్రకాష్ రావు,దాసరి నాగేశ్వర రావు,చింత నాగరాజు, భేతంశెట్టి విజయ్,బండి చిన్న వెంకటేశ్వర్లు,కొత్తపల్లి సోమయ్య,కేసుపాక వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.



బోడ శ్రీను పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన BRS పార్టీ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సీతంపేట బంజర గ్రామం పంచాయితికి చెందిన బోడ శ్రీను గారు మరణించిన విషయాన్ని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి  ధైర్యాన్ని ఇచ్చి కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపాన్ని  సానుభూతిని తెలియజేశారు.వారి పార్ధివ దేహనికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య,టిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడియా సత్యనారాయణ నాయక్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోడ హరినాయక్,కోపరేటివ్ డైరెక్టర్ గుగులోతు చందర్ నాయక్,ఆత్మ కమిటీ  డైరెక్టర్ గుగులోతు నెహ్రు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాజుల సీతారామయ్య భానోత్,జేత్రామ్  బానోత్,మాన్సింగ్ గుగులోత్ సత్యనారాయణ,బాలావత్ రాంబాబు,లావుడియా హీరోలాల్ లాకావత్,మోహన్ రావు,బాదావత్ చందర్ బోడ లక్ష్మ భూక్యా తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies